హైదరాబాద్: నగరంలో వివిధ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ చేస్తూ మహిళలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఠాను గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించి... తమదైన శైలిలో వారిని పోలీసులు విచారిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.