దొంగల అరెస్టు: 78 సెల్‌ఫోన్లు స్వాధీనం | Thieves arrested: 78 cellphones seized | Sakshi
Sakshi News home page

దొంగల అరెస్టు: 78 సెల్‌ఫోన్లు స్వాధీనం

Published Sat, Jun 6 2015 1:06 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

దొంగల అరెస్టు: 78 సెల్‌ఫోన్లు స్వాధీనం - Sakshi

దొంగల అరెస్టు: 78 సెల్‌ఫోన్లు స్వాధీనం

చాంద్రాయణగుట్ట: సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 78 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్ .కోటిరెడ్డి కథనం ప్రకారం... ముషీరాబాద్‌కు చెందిన పండ్ల వ్యాపారి మహబూబ్ లదాఫ్ (32) ఆర్థిక సమస్యలు ఎదుర్కొటున్నాడు.  తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ జహీర్ షా (28) సెల్‌ఫోన్లు చోరీ చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడమని లదాఫ్‌ను పురిగొల్పాడు.  

లదాఫ్ సెల్‌ఫోన్ షాపుల వద్దకు వెళ్లి.. వాటి యజమానులను మాటల్లో పెట్టి ఫోన్లు చోరీ చేయడం మొదలెట్టాడు. ఎత్తుకొచ్చిన సెల్‌ఫోన్లను జహీర్‌కు ఇచ్చి డబ్బు తీసుకునేవాడు. జహీర్ ఆ ఫోన్లను విడిభాగాలుగా చేసి విక్రయించేవాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement