విశాఖలో అక్రమంగా గంజాయి రవాణా, నలుగురు అరెస్ట్ | 4 held, Cannabis illegal transporting in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో అక్రమంగా గంజాయి రవాణా, నలుగురు అరెస్ట్

Published Mon, Dec 9 2013 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

అక్రమంగా గంజాయి రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై పోలీసులు దాడులు చేస్తున్నా వారి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది.

విశాఖపట్నం: అక్రమంగా గంజాయి రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై పోలీసులు దాడులు చేస్తున్నా వారి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. విశాఖ జిల్లాలోని ఆరులోవలో సోమవారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారివద్ద నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అక్రమ గంజాయి తరలిస్తున్న వారిలో ముగ్గురు ఒరిస్సాకు చెందిన కోరాపుట్‌కు చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement