మామూళ్ల కిక్
ఎక్సైజ్ శాఖలో లంచాల ప్రహసనం
మద్యం వ్యాపారుల నుంచి క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు
టాస్క్‌ఫోర్స్ అధికారులకు సైతం
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయూలు
విజయవాడ : ఎక్సైజ్ శాఖలో మామూళ్ల ప్రహసనం యథేచ్ఛగా సాగుతోంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందరికీ నెలవారీ మామూళ్లు భారీగానే అందుతున్నారుు. దీంతో జిల్లాలో ఎమ్మార్పీ నిబంధనను గాలికొదిలేసిన వ్యాపారులు ఇష్టానుసారంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. జిల్లాలో నెలకు సగటున రూ.100 కోట్లపైనే మద్యం విక్రయాలు జరుగుతున్నా.. నామమాత్రంగా కూడా నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు కావడంలేదు. జిల్లాలో 301 వైన్‌షాఫులు, 156 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వైన్‌షాపుల్లో తప్పనిసరిగా ఎమ్మార్పీకే విక్రయించాలని నిబంధన అమలులో ఉంది. ఇక బార్‌లలో ఎలాంటి నిబంధనలు లేకపోవటంతో 365 రోజులూ అధిక ధరలకే విక్రరుుస్తున్నారు. ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా 30 శాతం అధిక ధరలకు ఇక్కడ విక్రయూలు జరుగుతున్నారుు.
పెరుగుతున్న మద్యం విక్రయలు
జిల్లాలో గత మూడు నెలలుగా మద్యం విక్రయాలు పెరిగాయి. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. నవంబర్‌లో కొంత తక్కువగా ఉంటాయి. కానీ, గత నవంబర్‌లో కూడా భారీ విక్రయూలు జరిగారుు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే సగటున పదిశాతం అధిక విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ 31 అర్ధరాత్రి పార్టీల్లో మద్యం కొనుగోళ్లు రికార్డు స్థారుుకి చేరింది. ఒక్క డిసెంబర్ 31నే జిల్లాలో రూ.7కోట్ల విలువైన 17,800 కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. 2013, డిసెంబర్ 31న రూ.5కోట్ల వ్యాపారం జరిగింది. ఇలా.. జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతుండటంతో అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు.
అధికారులకు క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు
జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యారు. రెండు, మూడు ప్రధాన సిండికేట్లుగా మారి పోలీస్‌స్టేషన్లకు మామూళ్లు మొదలుకుని ఎక్సైజ్ శాఖలోని స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్ వరకు నెలవారీ మామూళ్లు క్రమం తప్పకుండా పంపిస్తున్నారు. జిల్లాలో 20 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 301 మద్యం షాపులు, 156 బార్లు ఉన్నాయి. ఒక్కో వైన్‌షాపు నిర్వాహకుడు నెలకు రూ.25వేల వరకు ఎక్సైజ్ శాఖ అధికారులకే చెల్లిస్తున్నారు.
రేట్లు ఫిక్స్ : వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు ముందుగానే మాట్లాడుకుని మామూళ్ల రేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఐదు నెలలుగా జిల్లాలో ఈ రేట్లు అమలులో ఉన్నాయి. స్టేషన్‌కు నెలకు రూ.13వేల వరకు మామూళ్లు అందుతున్నారుు. కానిస్టేబుల్ మొదలుకుని సీఐ వరకు అందరికీ వాటానే. అలాగే, సర్కిల్ ఉన్నతాధికారికి, కార్యాలయానికి నెలకు రూ.3వేలు, జిల్లాస్థాయి అధికారి, ఆయన కార్యాలయానికి రూ.3వేలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో కిందిస్థాయి నుంచి జిల్లా అధికారి వరకు అందరికీ కలిపి నెలకు రూ.6వేలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) నేతృత్వంలో ఉండే టాస్క్‌ఫోర్స్‌కు నెలకు రూ.6వేలు, రాష్ట్రస్థాయిలో దాడులు నిర్వహించే స్టేట్ టాస్క్‌ఫోర్స్‌కు ఆరు నెలలకు రూ.6వేలు మామూళ్లు అందుతున్నారుు.
మామూళ్ల భారం మందుబాబులపైనే..
మామూళ్ల నేపథ్యంలో వ్యాపారులు క్వార్టర్ మద్యం రూ.10 నుంచి రూ.15 ఎక్కువగా అమ్ముతున్నారు. ఎక్సైజ్ అధికారులు నెల మొదటి వారంలో బెల్ట్‌షాపులపై హడావుడి దాడులు చేసి.. తర్వాత వాటిని కూడా వదిలేస్తున్నారు. గడిచిన రెండు నెలల కాలంలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) కూడా జిల్లాలో దాడులు చేసిన సందర్భాలు లేవు. తిరువూరు, నూజివీడు, నందిగామల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. నిబంధనలు ఉల్లఘించి.. అధిక ధరలకు విక్రయూలు జరపడం వల్ల జిల్లాలోని వ్యాపారులకు నెలకు సగటున రూ.12కోట్ల అదనపు లాభం వస్తోంది