
సాక్షి, బంజారాహిల్స్: బోరబండ ఎస్పీఆర్‌హిల్స్ సమీపంలోని కాకతీయ వైన్స్‌లో మద్యం తీసుకునేందుకు గోపి అనే డ్రైవర్ శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. మద్యం ధరకు అనుగుణంగా క్యూఆర్ కోడ్‌తో డబ్బులు చెల్లించేందుకు యత్నిస్తుండగా ఆ మిషన్ రెండు నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఇంత ఆలస్యమా అంటూ గోపి మద్యం సీసా ఇచ్చిన సేల్స్‌మెన్ రంజిత్‌పై అదే సీసాతో తలపై దాడి చేశాడు.
దీంతో రంజిత్ తల పగలడంతో ఆగ్రహానికి లోనైన వైన్‌షాప్ ఇతర సిబ్బంది మూకూమ్మడిగా గోపిని కొట్టారు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై కూడా దాడి చేశారంటూ గోపి కూడా శనివారం ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment