Sales Man
-
రైతు ప్రతీకారం అదిరింది.. సినిమాలోని ట్విస్ట్ మాదిరిగా ఉంది!
Karnataka Farmer Was Humiliated At Mahindra Car Showroomఒక మనిషి ఆహార్యాన్ని బట్టి లేదా వేషధారణ చూసో తక్కువగా అంచనా వేయకూడదు. కొంతమంది ఇతరుల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడటమే కాక అవమానించాలనుకుంటారు. నిజానికి ఆ విధంగా చేస్తున్న వాళ్లే అందరిలోనూ నవ్వులు పాలవ్వడమే కాక క్షమాపణ కోరే పరిస్థితిని తెచ్చుకుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే..కర్ణాటకలో తుమకూరులోని మహీంద్రా షోరూమ్‌కి కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. ఆ రైతు ఆ షోరూమ్‌లోని సేల్స్‌మేన్ చేత అవమానింపబడ్డాడు. అతని వేషధారణ చూసిన సేల్స్‌మేన్ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని వెటకారంగా చెప్పాడు. పైగా నీ జేబులో కనీసం రూ. 10 కూడా ఉండకపోవచ్చు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కెంపె గౌడని చాలా అవమానించి మాట్లాడాడు. Karnataka farmer's sweet revenge on the Mahindra showroom: దీంతో ఆ సేల్స్‌మేన్‌కి రైతు కెంపెగౌడకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువస్తే గనుక నువ్వు ఎస్యూవీ కారుని ఈ రోజే డెలివరీ చేయాలి" అని సేల్స్‌మేన్‌కి ఒక చాలెంజ్ కూడా విసిరాడు. ఈ క్రమంలో రైతు సినిమాలోని హీరో మాదిరిగా ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువచ్చి సేల్స్‌మేన్‌కి చూపించాడు. దీంతో సేల్స్‌మేన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ సేల్స్‌మేన్ వెంటనే డెలీవరీ చేయడంలో విఫలమయ్యాడు, ఎందుకంటే వెయిటింగ్ లిస్టింగ్ ఉంటుంది కదా. దీంతో రైతు కెంపెగౌడ ఒక్కసారిగా ఆ సేల్స్‌మేన్ పై మండిపడటమే కాక అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే తనకు ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాక నెటిజన్లు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఈ వీడియోని విస్తృతంగా ట్వీట్ చేశారు. (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
వామ్మో.. తాగుబోతు ఎంత పనిచేశాడు!
సాక్షి, బంజారాహిల్స్: బోరబండ ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కాకతీయ వైన్స్‌లో మద్యం తీసుకునేందుకు గోపి అనే డ్రైవర్ శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. మద్యం ధరకు అనుగుణంగా క్యూఆర్ కోడ్‌తో డబ్బులు చెల్లించేందుకు యత్నిస్తుండగా ఆ మిషన్ రెండు నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఇంత ఆలస్యమా అంటూ గోపి మద్యం సీసా ఇచ్చిన సేల్స్‌మెన్ రంజిత్‌పై అదే సీసాతో తలపై దాడి చేశాడు. దీంతో రంజిత్ తల పగలడంతో ఆగ్రహానికి లోనైన వైన్‌షాప్ ఇతర సిబ్బంది మూకూమ్మడిగా గోపిని కొట్టారు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై కూడా దాడి చేశారంటూ గోపి కూడా శనివారం ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు. -
కార్ల షోరూమ్‌లో సేల్స్ పర్సన్‌గా శునకం
బ్రెజిల్: షోరూమ్‌కు వెళ్లగానే అక్కడి సేల్స్ పర్సన్లు మనకు స్వాగతం చెప్తూ అవసరమైన వాటిని చూపిస్తుంటారు. అయితే హ్యుందాయ్ షోరూమ్‌లో మాత్రం ఓ వీధి శునకం మీకు సేల్స్ పర్సన్‌గా వెల్కమ్ చెప్తుంది. వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌లోని సెర్రాలో హ్యుందాయ్ షోరూమ్ దగ్గర ఓ కుక్క ఎప్పుడూ అక్కడే తచ్చాడుతూ కనిపించేది. దాన్ని చూసి అక్కడుండేవారు ఎంతో జాలిపడేవారు. అయితే రోజులు గడుస్తున్నా అది షోరూమ్ ముందు ఎదురు చూడటం మానలేదు. దీంతో ఆ షోరూమ్ వాళ్లకి కూడా జాలేసి దాన్ని దత్తత తీసుకుని "టుస్కాన్ ప్రైమ్" అని నామకరణం చేశారు. (కరోనా భయం.. కారే నయం!) అనంతరం దాన్ని ఆ షోరూమ్‌లో సేల్స్ పర్సన్‌గా నియమిస్తూ ఐడీ కార్డు కూడా జారీ చేశారు. అది కూడా ఎంతో బుద్ధిగా, బాధ్యతగా తన పనులు నిర్వర్తిస్తోంది. ఆ షోరూమ్‌కు వచ్చే వినియోగదారులు కూడా కుక్క ప్రవర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టుస్కాన్ ప్రైమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక అకౌంట్ కూడా ఉంది. దీన్ని 43 వేల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ శునకం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (నదిలో లక్ష లింగాలు: నిజమేనా?) View this post on Instagram Bom Dia meus AUmigos 🐾🐶🐕 hoje meu dia começou cedo, mas não foi nas vendas, estou tentando ler e responder as milhares, juro, milhaaaares de mensagens que recebi nos últimos dias, mas é que de onde eu vim, não tinha essa tecnologia toda, eu e meus humanos estamos tentando ainda encontrar uma forma de como lidar com tanto amor e carinho assim, se eu não abri sua mensagem ou respondi, queria pedir desculpas, mas estamos tentando ao máximo abrir todas as mensagens para tentar agradecer a todos vocês, estou muito feliz com tudo isso! Muuuitos LAMbeijos para vocês 🐶 #tucson #prime #hyundai @primehyundai A post shared by TUCSON PRIME (@tucson_prime) on Aug 5, 2020 at 5:53am PDT -
పాకిస్తాన్ ముర్దాబాద్.. 1100లకే మూడు జతల షూ!
న్యూఢిల్లీ: ఓ సేల్స్‌మెన్‌గా రాణించాలంటే పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి. అవతలి వాళ్ల వీక్నెస్పై కొట్టాలి. మొత్తానికి కస్టమర్ల దృష్టిని ఆకర్షించి తన ఉత్పత్తులను అమ్ముకోవాలి. ఢిల్లీలో ఓ సేల్స్‌మెన్ ఇదే పని చేశాడు. పుల్వామా దాడి తర్వాత దేశమంతా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే కదా. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని చాలా మంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరు షాపు ఓనర్ కూడా రోడ్డుపై నిలబడి పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఉర్దూ కవి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ట్విటర్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. జాతీయభావాన్ని అద్భుతంగా అమ్ముకుంటున్నాడంటూ ఆయన ఈ వీడియో పోస్ట్ చేయడం విశేషం. పాకిస్థాన్ ముర్దాబాద్.. 1100లకే మూడు జతల షూ అంటూ తన షాపులోకి కస్టమర్లను ఆహ్వానించాడు. దీంతో చాలామంది కస్టమర్లు ఆయన షాపువైపు ఆకర్షితులయ్యారట. राष्ट्रवाद की बढिया मार्केटिंग😳😳😳 pic.twitter.com/zkV3X4tmxN — Imran Pratapgarhi (@ShayarImran) February 18, 2019 -
దూసుకొచ్చిన మృత్యువు
తాండూరు టౌన్ : బతుకుదెరువు కోసం తెల్లవారుజామునే నిద్రలేచి పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని మృత్యువులా దూసుకొచ్చిన లారీ బలిగొన్నది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం షావుకార్‌పేట్‌కు చెందిన శ్రీశైలం (40) నాపరాతి పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జీవనాధారం కోసం ప్రతినిత్యం తెల్లవారుజామున తాండూరు బస్టాండు సమీపంలో పాల ప్యాకెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కూడా యధావిధిగా అక్కడ పాలు విక్రయిస్తున్నాడు. కాగా నెల్లూరు నుంచి చెట్టినాడ్ సిమెంటు కర్మాగారానికి బొగ్గు లోడ్‌తో కొడంగల్ రోడ్డు నుంచి ఇందిరాచౌక్ వైపునకు లారీ వస్తున్నది. ముందు వెళ్తున్న మరో లారీని ఎడమ వైపు నుంచి లారీ డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోగా పక్కనే ఉన్న లారీకి తగిలింది. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డుకు ఓ మూలన పాల ప్యాకెట్లు విక్రయిస్తున్న శ్రీశైలంను ఢీకొట్టింది. అనంతరం బాలాజీ లాడ్జి ముందు పార్కింగ్ చేసి ఉన్న పవర్‌ప్లాంట్‌కు చెందిన ఓ వ్యక్తికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగం, నిర్లక్ష్యంతో లారీ నడిపి వ్యక్తి మృతికి కారకుడైన డ్రైవర్ విజయ్‌నాథ్‌తో పాటు క్లీనర్ కాళేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి లారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
బదిలీలతోనూ ‘మార్కెటింగ్’
అమలాపురం టౌన్:జిల్లా మార్కెటింగ్ శాఖలో బదిలీల పర్వం కొందరికి లాభసాటి బేరంగా మారింది. జిల్లాలో బదిలీల ప్రక్రియకు తెర లేచినప్పటి నుంచీ ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెర వెనుక ఉండి.. ‘కోరిన చోటికి బదిలీ చేరుుంచే’ దందా మొదలు పెట్టాడు. ఈ దందాలో ఓ రిటైర్డ్ ఉద్యోగి దళారీగా, ‘సేల్స్‌మన్’గా అవతారం ఎత్తి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం జిల్లాలో బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడ్డా మరో వారం రోజుల్లో మళ్లీ మొదలయ్యే క్రమంలో మార్కెటింగ్ శాఖలో లోపాయికారీగా కోరుకున్న చోటకు బదిలీ చేయాలంటే ‘ఇంత’ అవుతుందన్న బేరసారాలు జరుగుతున్నారుు. ఆ దళారీ జిల్లాలోని వివిధ మార్కెట్ యూర్డులకు చెందిన అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసి బేరసారాలకు దిగుతున్నాడు. తమ శాఖలో బదిలీల నిబంధనల ప్రకారం ఇదే శాఖకు చెందిన ఏ అధికారికీ అధికారాలు లేదని, బదిలీలు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగే అవకాశాలు ఉన్నా తెరవెనుక ఓ అధికారి చక్రం తిప్పుతున్నారని మార్కెటింగ్ ఉద్యోగులే అంటున్నారు. ఓ ఉన్నతాధికారి అండదండలున్న రిటైర్డ్ ఉద్యోగి తరచూ ఉద్యోగులకు ఫోన్లు చేసి ‘మీరు కోరుకున్న చోటు చెప్పండి. అక్కడికే బదిలీ చేసేందుకు సార్ అన్ని ఏర్పాట్లూ చేస్తారు. ‘ఫలానా’ మార్కెట్ యూర్డుకి అయితే ఇదీ రేటు?’ అంటూ బేరసారాలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. కోరుకున్న యూర్డుకి బదిలీ చేసేందుకు ప్రతిఫలంగా రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ దళారీ రేట్లు చెపుతున్నాడని అంటున్నారు. జిల్లాలో అధిక ఆదాయం, సెస్‌ల వసూళ్లు అధికంగా ఉండే మార్కెట్ యార్టులకు బదిలీపై వెళ్లాలంటే రేటు మరి కాస్త పెంచుతున్నారు. ఉదాహరణకు మండపేట, తాళ్లరేవు, రాజమండ్రి మార్కెట్ యార్డులకు వెళ్లేందుకు సహజంగానే పోటీ పడతారని, ‘దండుకోవడానికి’ దండిగా అవకాశాలున్న ఇలాంటి యార్డులకు బదిలీ కోరితే ఎక్కువ రేటు చెల్లించాలని, ‘ఉన్నతాధికారి’ భరోసాతో బదిలీ ఖాయమని దళారీ ఊరిస్తున్నాడని చెపుతున్నారు. ‘కౌన్సెలింగ్నూ ‘మేనేజ్’ చేస్తాం..’ జిల్లాలో 20 మార్కెట్ యూర్డులు ఉన్నాయి. వీటిలో దాదాపు 100 మంది అధికారులు, ఉద్యోగులకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. బదిలీలు అనివార్యమయ్యే వారికి ఆ దళారీ గత వారం రోజులుగా ఫోన్లు చేసి బేరసారాలకు దిగుతున్నాడు. ఇంతలో బదిలీల ప్రక్రియ కొద్ది రోజులు వాయిదా పడ్డా కూడా ఆ దళారీ పదే పదే ఫోన్లు చేసి ఏమి నిర్ణయం తీసుకున్నారంటూ వేధిస్తున్నాడని కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారి అండదండలున్న ఆ దళారీతో ఫోన్లో ఏమి మాట్లాడితే ఎటు నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళనతో ‘రేపు చెబుతాం... ఎల్లుండి చెబుతామని’ దాటవేస్తున్నామంటున్నారు. బదిలీల కౌన్సెలింగ్ వ్యవహారం కూడా తామే చూసుకుంటామని కూడా దళారీ హామీ ఇస్తున్నాడంటున్నారు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించి, దళారీ బెడదను విరగడ చేయూలని, బదిలీలు పూర్తి పారదర్శకతతో జరిపించాలని కోరుతున్నారు. -
అత్త మీద కోపం....
ఒక్కో సంఘటన చూస్తుంటే సామెతల్లో ఎంత సత్యం ఉందో అర్థం అవుతోంది. ఇందుకు నటి శ్రుతిహాసన్ ప్రవర్తన తాజా ఉదాహరణ. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్. అలాంటి సెలబ్రిటీ స్టార్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలోనూ, సంచలన సంఘటనలతోనూ వార్తల్లో కెక్కడం పరిపాటిగా మారిందనే ప్రచారాన్ని కొట్టివేయలేం. ఆ మధ్య హిందీ చిత్రం డీ డేలో మితి మీరిన శృంగారాన్ని ఒలకబోసి సినీ విమర్శకుల నోళ్లకు పని చెప్పారు. మరోసారి ఓ ఆగంతకుడు హద్దులు మీరిన అభిమానం చూపించడంతో శ్రుతిహాసన్ కలకలం సృష్టించారు. ఇటీవల ఒక తెలుగు నిర్మాత తన అనుమతి లేకుండా తన గ్లామరస్ ఫొటోలను నెట్లో ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ప్రచారం పొందారు. తాజాగా ఒక సేల్స్‌మన్‌తో లడాయికి దిగి తన అహం వెళ్లగక్కిన సంఘటన విస్మయానికి గురి చేసింది. అదేంటో చూద్దామా! శ్రుతిహాసన్ ఇటీవల చెన్నైలో ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. తన మేకప్‌లకు చెందిన కొన్ని వస్తువులు కావాలని అడిగారు. సేల్స్‌మన్ మేకప్ సామగ్రి లేదని బదులిచ్చాడు. ఆగ్ర హించిన శ్రుతి ఆ సేల్స్‌మన్‌ను నోటికొచ్చినట్లు తిట్టేశారు. రెగ్యులర్ కస్టమర్ షాప్‌నకు వచ్చి ఒక వస్తువు కావాలని అడిగితే అది ఉందో? లేదో కూడా చూడకుండా గుడ్డిగా లేదంటావా, నీ వల్ల కాకపోతే వేరే సెల్స్మన్తో చెప్పి తీసుకురమ్మని చెప్పవచ్చుగా అంటూ చెడామడా తిట్టేశారు. షాక్‌కు గురైన సేల్స్‌మన్ కొంతసేపటికి తేరుకుని ఏమి చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. విషయమేమిటంటే శ్రుతిహాసన్ అడిగిన మేకప్ సామగ్రి నిజంగానే ఆ షాపులో లేవట. మూడ్ అవుట్లో ఉండడం వలనే శ్రుతి అలా ప్రవర్తించారని తెలిసింది. అత్తమీద కోసం దుత్త మీద చూపించడం అంటే ఇదేగా మరి.