పాకిస్తాన్‌ ముర్దాబాద్‌.. 1100లకే మూడు జతల షూ! | Pakistan Murdabad slogan to sell shoes in Delhi video goes viral   | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ముర్దాబాద్‌.. 1100లకే మూడు జతల షూ!

Published Wed, Feb 20 2019 9:57 AM | Last Updated on Wed, Feb 20 2019 10:05 AM

Pakistan Murdabad slogan to sell shoes in Delhi video goes viral   - Sakshi

న్యూఢిల్లీ: ఓ సేల్స్‌మెన్‌గా రాణించాలంటే పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి. అవతలి వాళ్ల వీక్‌నెస్‌పై కొట్టాలి. మొత్తానికి కస్టమర్ల దృష్టిని ఆకర్షించి తన ఉత్పత్తులను అమ్ముకోవాలి. ఢిల్లీలో ఓ సేల్స్‌మెన్‌ ఇదే పని చేశాడు. పుల్వామా దాడి తర్వాత దేశమంతా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే కదా. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని చాలా మంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

దీంతో సదరు షాపు ఓనర్‌ కూడా రోడ్డుపై నిలబడి పాకిస్తాన్‌ వ్యతిరేక నినాదాలు చేస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఉర్దూ కవి ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేశాడు. జాతీయభావాన్ని అద్భుతంగా అమ్ముకుంటున్నాడంటూ ఆయన ఈ వీడియో పోస్ట్‌ చేయడం విశేషం. పాకిస్థాన్‌ ముర్దాబాద్‌.. 1100లకే మూడు జతల షూ అంటూ తన షాపులోకి కస్టమర్లను ఆహ్వానించాడు. దీంతో చాలామంది కస్టమర్లు ఆయన షాపువైపు ఆకర్షితులయ్యారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement