అత్త మీద కోపం.... | Shruti Haasan throws a fit at a shopping mall! | Sakshi
Sakshi News home page

అత్త మీద కోపం....

Published Mon, Jul 7 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

అత్త మీద కోపం....

అత్త మీద కోపం....

ఒక్కో సంఘటన చూస్తుంటే సామెతల్లో ఎంత సత్యం ఉందో అర్థం అవుతోంది. ఇందుకు నటి శ్రుతిహాసన్ ప్రవర్తన తాజా ఉదాహరణ. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్. అలాంటి సెలబ్రిటీ స్టార్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలోనూ, సంచలన సంఘటనలతోనూ వార్తల్లో కెక్కడం పరిపాటిగా మారిందనే ప్రచారాన్ని కొట్టివేయలేం. ఆ మధ్య హిందీ చిత్రం డీ డేలో మితి మీరిన శృంగారాన్ని ఒలకబోసి సినీ విమర్శకుల నోళ్లకు పని చెప్పారు. మరోసారి ఓ ఆగంతకుడు హద్దులు మీరిన అభిమానం చూపించడంతో శ్రుతిహాసన్ కలకలం సృష్టించారు.
 
 ఇటీవల ఒక  తెలుగు నిర్మాత తన అనుమతి లేకుండా తన గ్లామరస్ ఫొటోలను నెట్‌లో ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి  ప్రచారం పొందారు. తాజాగా ఒక  సేల్స్‌మన్‌తో లడాయికి దిగి తన అహం వెళ్లగక్కిన సంఘటన విస్మయానికి గురి చేసింది. అదేంటో చూద్దామా! శ్రుతిహాసన్ ఇటీవల చెన్నైలో ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. తన మేకప్‌లకు చెందిన కొన్ని వస్తువులు కావాలని అడిగారు. సేల్స్‌మన్ మేకప్ సామగ్రి లేదని బదులిచ్చాడు. ఆగ్ర హించిన శ్రుతి ఆ సేల్స్‌మన్‌ను నోటికొచ్చినట్లు తిట్టేశారు.
 
 రెగ్యులర్ కస్టమర్ షాప్‌నకు వచ్చి ఒక వస్తువు కావాలని అడిగితే అది ఉందో? లేదో కూడా చూడకుండా గుడ్డిగా లేదంటావా, నీ వల్ల కాకపోతే వేరే సెల్స్‌మన్‌తో చెప్పి తీసుకురమ్మని చెప్పవచ్చుగా అంటూ చెడామడా తిట్టేశారు. షాక్‌కు గురైన సేల్స్‌మన్ కొంతసేపటికి తేరుకుని ఏమి చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. విషయమేమిటంటే శ్రుతిహాసన్ అడిగిన మేకప్ సామగ్రి నిజంగానే ఆ షాపులో లేవట. మూడ్ అవుట్‌లో ఉండడం వలనే శ్రుతి అలా ప్రవర్తించారని తెలిసింది. అత్తమీద కోసం దుత్త మీద చూపించడం అంటే ఇదేగా మరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement