సూర్య, శ్రుతి మరోసారి
సూర్య, శ్రుతి మరోసారి
Published Sun, Apr 13 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM
కోలీవుడ్‌లో నటి శ్రుతిహాసన్ తొలి హీరో సూర్య. ఈ జంట 7 ఆమ్ అరివు (సెవెన్త్ సెన్స్) చిత్రంలో రొమాన్స్ చేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా నటనా పరంగా సూర్య, శ్రుతిహాసన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత 3 చిత్రంలో శ్రుతిహాసన్ ధనుష్‌తో జతకట్టారు. ఈ చిత్రం కూడా పై చిత్ర ఫలితాన్నే ఇచ్చింది. దీంతో శ్రుతిహాసన్ టాలీవుడ్, బాలీవుడ్‌లపై దృష్టి సారించారు. ఈ రెం డు భాషల్లోనూ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ముఖ్యంగా తెలుగులో టాప్ లెవల్‌లో ప్రకాశిస్తున్న ఈ బ్యూటీకి తాజాగా తమిళంలో అవకాశాలు వరుస కడుతున్నాయి.
త్వరలో విశాల్ సరసన పూజై చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న శ్రుతి యువ నటుడు జయ్ తో కూడా ఒక చిత్రంలో రొమాన్స్‌కు సై అన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన తొలి చిత్ర హీరో సూర్యతో మరోసారి జత కట్టడానికి శ్రుతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. బిరియాని చిత్రాన్ని కార్తీతో తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఇప్పుడు ఆయన సోదరుడు సూర్య హీరోగా ఒక భారీ చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హీరోయిన్‌గా నటించనున్నట్లు కోలీవుడ్ టాక్. వెంకట్ ప్రభు చెప్పిన కథ నచ్చడంతో శ్రుతి ఓకే చెప్పినట్లు తెలిసింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతున్నాయి. యువన్ శంకర్ సంగీ తాన్ని అందిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తమిళ ఉగాది సందర్భంగా సోమవారం చెన్నైలో ప్రారంభం కానున్నాయి. చిత్ర షూటింగ్ జూన్‌లో మొదలవుతుందని సమాచారం. సూర్య ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో అంజాన్ చిత్రంలో నటిస్తున్నారు.
Advertisement
Advertisement