విజయ్‌తో శ్రుతి, దీపికా రొమాన్స్
ఇళయ దళపతి విజయ్ ఇద్దరి భామలతో చిందులేయనున్నారు. ఆ ఇద్దరూ బాగా క్రేజీ హీరోయిన్లు కావడం విశేషం. ఒకరేమో బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న దీపికా పదుకునే. మరొకరేమో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో ఉన్న శ్రుతిహాసన్. ఈ ఇద్దరితోనూ కోలీవుడ్ నటుడు విజయ్ రొమాన్స్ చేయనున్నారు. తుపాకీ, జిల్లా వంటి వరుస విజయూలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్న విజయ్ సరసన నటించడానికి అగ్ర కథానారుుకలు సై అంటున్నారు.
శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో విజయ్‌కు జంటగా శ్రుతిహాసన్, దీపికా పదుకొనేలు నటించనున్నట్లు దర్శకుడు ప్రకటించారు. నటుడు విజయ్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మరో రెండు నెలల్లో పూర్తి కానుంది. తర్వాత దర్శకుడు శింబు దేవన్ చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. ఇందులో విజయ్‌కి జంటగా శ్రుతిహాసన్, దీపికా పదుకొనేలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు కాలేదని యూనిట్ వర్గాలు వెల్లడించారుు.
కత్తి చిత్రం పూర్తికాగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. కత్తి షూటింగ్ కోసం చెన్నైలో భారీ సెట్స్ ఏర్పాటు చేశారు. ఇదివరకే ఉత్తర జిల్లాల్లో ఈ చిత్రం షూటింగ్ వేగవంతంగా సాగింది. ప్రస్తుతం ఒక వారం రోజులపాటు సెలవు ప్రకటించారు. దీంతో విశ్రాంతి కోసం ఈ చిత్రం యూనిట్ చెన్నై చేరుకుంది. తర్వాత చెన్నైలో ఏర్పాటుకానున్న సెట్స్ లో చిత్రీకరణ జరగనుంది. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.