ఇళయ దళపతితో జోడీకి నో | Deepika Padukone not act in Vijay movie | Sakshi
Sakshi News home page

ఇళయ దళపతితో జోడీకి నో

Published Fri, Jul 18 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

ఇళయ దళపతితో  జోడీకి నో

ఇళయ దళపతితో జోడీకి నో

ఇళయ దళపతిగా అభిమానుల గుండెల్లో వెలుగొందుతున్న నటుడు విజయ్‌తో జతకట్టడానకి ఇద్దరు బాలీవుడ్ క్రేజీ భామలు నో చెప్పారు. వారిలో ఒకరు ప్రియాంక చోప్రా. మరొకరు దీపిక పడుకొనే. విజయ్ ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.
 
 యువ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వంలో పాంటసీ కథా చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో నటి హన్సిక ఒక హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ప్రధాన హీరోయిన్ పాత్రకు ముంబాయి నటీమణుల్లో ఒకర్ని ఎంపిక చేయాలని దర్శకుడు భావించా రు. నటి ప్రియాంక చోప్రాను నటింపజేయూలని చూశారు.
 
 ఆమె ముంబయితోపాటు ఇతర దేశాల్లో మ్యూజిక్ షోలలో బిజీగా ఉండడంతో విజయ్‌తో నటించే అవకాశాన్ని అంగీకరించలేకపోయారని సమాచారం. దీంతో కోచ్చడయాన్‌లో రజనీకాంత్‌తో జతకట్టిన దీపిక పడుకొనేను ఎంపికచేయాలని భావించగా ఆమె మరో ఆలోచన లేకుండా నో చెప్పారట. దీంతో విజయ్ సరసన నటించేందుకు శ్రుతిహాసన్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement