Cannes 2023: Shruti Haasan At The 76th Cannes Film Festival - Sakshi
Sakshi News home page

Cannes Film Festival 2023: ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను: శ్రుతీహాసన్‌

May 24 2023 2:33 AM | Updated on May 24 2023 11:48 AM

Shruti Haasan at the 76th Cannes Film Festival - Sakshi

‘‘ఓ సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్‌ సమానమైన పారితోషికాన్ని అందుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం 76వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు శ్రుతీహాసన్‌. ఈ సందర్భంగా ‘హీరోతో సమానమైన పారితోషికాన్ని అందుకోవడానికి నాకు రెండు దశాబ్దాలు పట్టింది’’ అన్న ప్రియాంకా చోప్రా మాటలపై మీ స్పందన ఏంటి? అన్న ప్రశ్న శ్రుతీకి ఎదురైంది.

ఈ విషయంపై శ్రుతీహాసన్‌ స్పందిస్తూ– ‘‘ప్రియాంకా చోప్రా అద్భుతం సాధించారు (హాలీవుడ్‌లో హీరోకి సమానంగా పా రితోషికం అందుకున్న విషయాన్ని ఉద్దేశించి). మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం అనే అంశం గురించి కనీసం చర్చ కూడా లేదు. కానీ హీరోలతో పాటుగా హీరోయిన్లకి కూడా సమాన వేతనం లభించే రోజు రావాలని ఎదురు చూస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.

ఇంకా మాట్లాడుతూ– ‘‘గతంలో నేను కాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పా ల్గొన్నాను. ఈసారి నేను నటించిన ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ‘ది ఐ’ కోసం కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నాను. విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్న కాన్స్‌ వేడుకల్లో దేశం తరఫున నేను ఓ ప్రతినిధిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement