Cannes Film Festival 2023
-
అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్‌లో ఎవరెవరంటే?
బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్‌ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్ డ్రెస్సులతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంటారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్‌తో దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. View this post on Instagram A post shared by Urvashi Rautela❤️ (@asliurvashians) అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అత్యంత చెత్త ఫ్యాషన్‌తో దారుణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రోల్స్‌కు గురైంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్‌ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్‌షీట్, కర్టెన్ క్లాత్‌ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!
సమంత, దేవ్ మోహన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. (ఇది చదవండి: NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ) అయితే అభిమానులను మెప్పించలేకపోయిన ఈ సినిమాకు అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ మూవీకి గతంలో న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్‌గా అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: హీరోల కోసం హీరోయిన్లను వెయిట్ చేయించేవారు: ఆదాశర్మ) తాజాగా ఫ్రాన్స్‌లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా.. మరికొందరేమో ఈ సినిమాకు ఎవరు ఇచ్చారు? అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
Cannes 2023: కాన్స్ లో ‘కెన్నెడీ’కి
ఆదరణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిశారు సన్నీ లియోన్ . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది యూనిట్. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ చిత్ర యూనిట్‌కు దక్కినట్లు తెలిసింది. ఇక కాన్స్ రెడ్ కార్పెట్‌పై సన్నీ లియోన్ నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ . సన్నీకి హెల్ప్ చేసిన అనురాగ్ కాన్స్ రెడ్ కార్పెట్‌పై పొడవాటి గౌనులో సన్నీ లియోన్ మెరిశారు. అయితే నడుస్తున్నప్పుడు ఆ గౌను ఆమె షూలో చిక్కుకోవడంతో ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న అనురాగ్ కశ్యప్ ఈ విషయాన్ని గ్రహించి సన్నీకి హెల్ప్ చేశారు. అలాగే మౌనీ రాయ్, అదితీరావ్ హైదరీలు కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పెవిలియన్ లో ‘లయనీస్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరి, సంధు ముఖ్య తారలు. -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను: శ్రుతీహాసన్
‘‘ఓ సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్ సమానమైన పారితోషికాన్ని అందుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం 76వ కాన్స్ చలన చిత్రోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు శ్రుతీహాసన్. ఈ సందర్భంగా ‘హీరోతో సమానమైన పారితోషికాన్ని అందుకోవడానికి నాకు రెండు దశాబ్దాలు పట్టింది’’ అన్న ప్రియాంకా చోప్రా మాటలపై మీ స్పందన ఏంటి? అన్న ప్రశ్న శ్రుతీకి ఎదురైంది. ఈ విషయంపై శ్రుతీహాసన్ స్పందిస్తూ– ‘‘ప్రియాంకా చోప్రా అద్భుతం సాధించారు (హాలీవుడ్లో హీరోకి సమానంగా పా రితోషికం అందుకున్న విషయాన్ని ఉద్దేశించి). మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం అనే అంశం గురించి కనీసం చర్చ కూడా లేదు. కానీ హీరోలతో పాటుగా హీరోయిన్లకి కూడా సమాన వేతనం లభించే రోజు రావాలని ఎదురు చూస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘గతంలో నేను కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పా ల్గొన్నాను. ఈసారి నేను నటించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ‘ది ఐ’ కోసం కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నాను. విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్న కాన్స్ వేడుకల్లో దేశం తరఫున నేను ఓ ప్రతినిధిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఊహించని ఘటన.. మహిళ ఒంటిపై ‘రక్తం’ పోసుకుని
అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక మహిళ తెలిపిన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫెస్టివల్లో ఆదివారం సాయంత్రం ఫ్రెంచ్ చలనచిత్ర దర్శకుడు జస్ట్ ఫిలిప్పోట్ చిత్రం యాసిడ్ ప్రీమియర్‌కు ముందు ఓ మహిళ ఉక్రెయిన్ జెండా రంగులున్న దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పైకి నడుచుకుంటూ వెళ్లి, ఓ చోట నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. అనంతరం తన వెంట తెచ్చిన బాటిల్‌ను తెరిచి అందులోని ఎరుపు రంగుని తన తలపై పోసుకుని నిరసన తెలపడం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించి వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. గత సంవత్సర కాలంగా రష్యా ఉక్రెయిన్‌పై జరుపుతున్న దాడులు కారణంగా అక్కడ నెత్తుటి దారులు ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంకేతంగా ఆ మహిళ నకిలీ రక్తంతో ఈ రకంగా తన నిరసన ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అయితే సదరు మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఉక్రెయిన్ దేశస్థురాలిగా అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులకు వ్యతిరేకిస్తూ ఈ ఏడాది కూడా రష్యా ప్రతినిధులు, ఫిల్మ్ కంపెనీలపై కేన్స్ నిషేధం విధించారు. గతేడాది కూడా ఓ మహిళ ఇలాగే అనూహ్యంగా నిరసనకు దిగి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. At the Cannes Film Festival, a brave young lady dressed in the colors of Ukraine doused herself in fake blood. She did it on the red carpet before the screening of the Russian film "Acid". The security service quickly ran up to her and rushed her away. 🇺🇦💙💛… pic.twitter.com/rqx2CNlJ0N — Snodgrass (@Snodgrass9876) May 22, 2023 చదవండి: సూడాన్: అమెరికా, సౌదీ దౌత్యం.. సంబురపడేలోపే కథ మళ్లీ మొదటికి!