Shruti Haasan Comments On Remunaration Difference Between The Actors - Sakshi
Sakshi News home page

Shruti Haasan: ఇక్కడ కూడా అలాంటి రోజులు రావాలి: శృతిహాసన్

Published Fri, May 26 2023 3:50 PM | Last Updated on Fri, May 26 2023 4:43 PM

Shruti Haasan  - Sakshi

నటి శ్రుతిహాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తనకు అనిపించింది బయటకు చెప్పే బోల్డ్‌ అండ్‌ బ్యూటీ ఈమె. స్వయంకృషితో ఎదిగిన నటి శ్రుతిహాసన్‌. నిజ జీవితంలోనూ ఆమె ఒక సంచలనమే. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ వారసురాలైనా.. ఆయన పేరు ఏ విధంగానూ వాడుకోవడానికి ఇష్టపడని నటి.

(ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్‌ సైన్‌ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్‌)

అయితే తన తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, తను మాత్రం వారి నుంచి ఎలాంటి ఆర్థికసాయాన్ని ఇప్పటి వరకు కోరలేదని బహిరంగంగానే చెప్పింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రుతిహాసన్‌.. ఇటీవల తెలుగులో నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి.

ఇకపోతే హీరో హీరోయిన్ల పారితోషికం విషయంలో సమానత్వం కోసం కొందరు హీరోయిన్లు బహిరంగంగానే తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. హీరోలకు తామేమి తక్కువ కాదని చిత్ర విజయాల విషయంలో తమ భాగం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నటి శ్రుతిహాసన్‌ కూడా పేర్కొనడం విశేషం.

(ఇది చదవండి: నటుడి రెండో పెళ్లి.. మొదటి భార్య పోస్టులు వైరల్‌..)

ఆ మధ్య ప్రియాంక చోప్రా తన కెరీర్‌లో 20 ఏళ్ల తర్వాత హీరోకు సమానంగా తమ పారితోషికం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన నటి శ్రుతిహాసన్‌ హీరోయిన్లకు హీరోలకు సమానంగా ఇవ్వాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో హీరోకు సమానంగా అందుకున్నారని.. ఇక్కడ కూడా ఆ రోజు రావాలని తాను ఎదురుచూస్తున్నానని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement