అజిత్‌కు జంటగా శ్రుతి? | Shruti Haasan to Romance with Ajith | Sakshi
Sakshi News home page

అజిత్‌కు జంటగా శ్రుతి?

Published Tue, Feb 17 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

అజిత్‌కు జంటగా శ్రుతి?

అజిత్‌కు జంటగా శ్రుతి?

కథానాయకీగా నటిస్తున్న శ్రుతి హాసన్ గ్రాఫ్ నానాటికీ పెరుగుతోంది. ఇలా తక్కువ సినిమాలతో ఎక్కువ ప్రాచుర్యం పొందిన నటీమణుల్లో శ్రుతి హాసన్ ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. అదే విధంగా చాలా మంది మాదిరిగానే ఫ్లాప్‌ల నుంచి కెరీర్‌ను ప్రారంభించి హిట్స్ సాధించిన శ్రుతి హాసన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. చక్కని అభినయంతో పాటుగా గ్లామర్‌ను విచ్చల విడిగా ప్రదర్శించేందుకు వెనుకాడని ఈ నటితో యువ స్టార్స్ నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. పూజై చిత్రంతో తమిళంలో హిట్ ఖాతాను తెరచిన శ్రుతి హాసన్, ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ పులి చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు.  
 
 ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ద్విభాషాచిత్రం (తమిళం, తెలుగు) చిత్రంలో కార్తీ సరసన నటించే ందుకు సిద్ధమవుతున్నారు. వీరం చిత్రం ఫేం శివ దర్శకత్వంలో మరో సారి అజిత్ నటించేందుకు రెడీ అయ్యారు. ఆరంభం, ఎన్నై అరిందాల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో అజిత్ సరసన నటించేందుకు నటి తమన్న గట్టిగా ప్రయత్నించి విఫలమైనట్టు సినీ వర్గాల బోగట్టా. అదే విధంగా సమంత నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్దరూ కాదు క్రేజీ నటి శ్రుతి హాసన్‌తో జత కట్టాలని అజిత్ కోరుకుంటున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలు కట్టనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement