అజిత్‌తో మరోసారి | Once again Tamanna to team up with Ajith | Sakshi
Sakshi News home page

అజిత్‌తో మరోసారి

Published Wed, Apr 20 2016 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

అజిత్‌తో మరోసారి

అజిత్‌తో మరోసారి

నటుడు అజిత్‌తో మరో సారి రొమాన్స్‌కు మిల్కీబ్యూటీ తమన్న సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. వరుసగా విజయాలను అందుకుంటున్న నటులలో అజిత్ ముందున్నారని చెప్పవచ్చు. ఆరంభం, వీరం, ఎన్నై అదిరిందాళ్, వేదాళం అంటూ విజయ పథంలో దూసుకు పోతున్న అజిత్ తాజాగా తన 57వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు.చేసిన నిర్మాతకే వరుసగా చిత్రాలు చేయడం, ఒకే దర్శకుడికి వరుసగా అవకాశం ఇవ్వడం అన్నది అజిత్‌కే చెందుతుంది.
 
  ఆరంభం, ఎన్నైఅరిందాళ్, వేదాళం చిత్రాలను నిర్మాత ఏఎం.రత్నంకు చేసిన అజిత్ అదే విధంగా శివ దర్శకత్వంలో వీరం, వేదాళం చిత్రాల్లో నటించారు. తాజాగా మరో సారి అదే దర్శకుడితో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. వే దాళం చిత్రం తరువాత కాలికి శస్త్ర చికిత్స, ఆపై విదేశీయానం అంటూ విశ్రాంతి తీసుకుని రీచార్జ్ అయ్యి తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు.
 
 ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి.త్యాగరాజన్ భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రం మే నెల చివరి వారంలో గానీ జూన్ మొదటి వారంలో గానీ ప్రారంభం కానున్నట్లు నిర్మాత ఇటీవల వెల్లడించారు. కాగా ఇందులో అజిత్‌తో రొమాన్స్ చేసే ముద్దుగుమ్మలు ఎవరన్నది ఇప్పటి వరకూ గోప్యంగానే ఉంది. అయితే నటి అనుష్క, త్రిషలు నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాంటి ప్రచారానికి బ్రేక్ చేస్తూ ఇంకా పేరు నిర్ణయించని తమ చిత్రంలో తమన్న, సృష్టి డాంగే నటించనున్నట్లు స్పష్టం చేశారు.
 
 విశేషం ఏమిటంటే ఇటీవల నటి తమన్న మరోసారి అజిత్‌తో నటించే అవకాశాన్ని సాధించుకుంటానని చాలా కాన్ఫిడెంట్‌గా ప్రకటించారు. అప్పుడు ఆ విషయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఈ మిల్కీబ్యూటీ మాత్రం అనుకున్నది సాధించారన్నమాట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement