అమలాపురం టౌన్:జిల్లా మార్కెటింగ్ శాఖలో బదిలీల పర్వం కొందరికి లాభసాటి బేరంగా మారింది. జిల్లాలో బదిలీల ప్రక్రియకు తెర లేచినప్పటి నుంచీ ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెర వెనుక ఉండి.. ‘కోరిన చోటికి బదిలీ చేరుుంచే’ దందా మొదలు పెట్టాడు. ఈ దందాలో ఓ రిటైర్డ్ ఉద్యోగి దళారీగా, ‘సేల్స్‌మన్’గా అవతారం ఎత్తి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం జిల్లాలో బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడ్డా మరో వారం రోజుల్లో మళ్లీ మొదలయ్యే క్రమంలో మార్కెటింగ్ శాఖలో లోపాయికారీగా కోరుకున్న చోటకు బదిలీ చేయాలంటే ‘ఇంత’ అవుతుందన్న బేరసారాలు జరుగుతున్నారుు.
ఆ దళారీ జిల్లాలోని వివిధ మార్కెట్ యూర్డులకు చెందిన అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసి బేరసారాలకు దిగుతున్నాడు. తమ శాఖలో బదిలీల నిబంధనల ప్రకారం ఇదే శాఖకు చెందిన ఏ అధికారికీ అధికారాలు లేదని, బదిలీలు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగే అవకాశాలు ఉన్నా తెరవెనుక ఓ అధికారి చక్రం తిప్పుతున్నారని మార్కెటింగ్ ఉద్యోగులే అంటున్నారు. ఓ ఉన్నతాధికారి అండదండలున్న రిటైర్డ్ ఉద్యోగి తరచూ ఉద్యోగులకు ఫోన్లు చేసి ‘మీరు కోరుకున్న చోటు చెప్పండి. అక్కడికే బదిలీ చేసేందుకు సార్ అన్ని ఏర్పాట్లూ చేస్తారు.
‘ఫలానా’ మార్కెట్ యూర్డుకి అయితే ఇదీ రేటు?’ అంటూ బేరసారాలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. కోరుకున్న యూర్డుకి బదిలీ చేసేందుకు ప్రతిఫలంగా రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ దళారీ రేట్లు చెపుతున్నాడని అంటున్నారు. జిల్లాలో అధిక ఆదాయం, సెస్‌ల వసూళ్లు అధికంగా ఉండే మార్కెట్ యార్టులకు బదిలీపై వెళ్లాలంటే రేటు మరి కాస్త పెంచుతున్నారు. ఉదాహరణకు మండపేట, తాళ్లరేవు, రాజమండ్రి మార్కెట్ యార్డులకు వెళ్లేందుకు సహజంగానే పోటీ పడతారని, ‘దండుకోవడానికి’ దండిగా అవకాశాలున్న ఇలాంటి యార్డులకు బదిలీ కోరితే ఎక్కువ రేటు చెల్లించాలని, ‘ఉన్నతాధికారి’ భరోసాతో బదిలీ ఖాయమని దళారీ ఊరిస్తున్నాడని చెపుతున్నారు.
‘కౌన్సెలింగ్‌నూ ‘మేనేజ్’ చేస్తాం..’
జిల్లాలో 20 మార్కెట్ యూర్డులు ఉన్నాయి. వీటిలో దాదాపు 100 మంది అధికారులు, ఉద్యోగులకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. బదిలీలు అనివార్యమయ్యే వారికి ఆ దళారీ గత వారం రోజులుగా ఫోన్లు చేసి బేరసారాలకు దిగుతున్నాడు. ఇంతలో బదిలీల ప్రక్రియ కొద్ది రోజులు వాయిదా పడ్డా కూడా ఆ దళారీ పదే పదే ఫోన్లు చేసి ఏమి నిర్ణయం తీసుకున్నారంటూ వేధిస్తున్నాడని కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారి అండదండలున్న ఆ దళారీతో ఫోన్లో ఏమి మాట్లాడితే ఎటు నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళనతో ‘రేపు చెబుతాం... ఎల్లుండి చెబుతామని’ దాటవేస్తున్నామంటున్నారు. బదిలీల కౌన్సెలింగ్ వ్యవహారం కూడా తామే చూసుకుంటామని కూడా దళారీ హామీ ఇస్తున్నాడంటున్నారు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించి, దళారీ బెడదను విరగడ చేయూలని, బదిలీలు పూర్తి పారదర్శకతతో జరిపించాలని కోరుతున్నారు.
బదిలీలతోనూ ‘మార్కెటింగ్’
Published Wed, Jun 3 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement