బ్రెజిల్: షోరూమ్‌కు వెళ్లగానే అక్కడి సేల్స్ పర్సన్లు మనకు స్వాగతం చెప్తూ అవసరమైన వాటిని చూపిస్తుంటారు. అయితే హ్యుందాయ్ షోరూమ్‌లో మాత్రం ఓ వీధి శునకం మీకు సేల్స్ పర్సన్‌గా వెల్‌కమ్ చెప్తుంది. వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌లోని సెర్రాలో హ్యుందాయ్ షోరూమ్ దగ్గర ఓ కుక్క ఎప్పుడూ అక్కడే తచ్చాడుతూ కనిపించేది. దాన్ని చూసి అక్కడుండేవారు ఎంతో జాలిపడేవారు. అయితే రోజులు గడుస్తున్నా అది షోరూమ్ ముందు ఎదురు చూడటం మానలేదు. దీంతో ఆ షోరూమ్ వాళ్లకి కూడా జాలేసి దాన్ని దత్తత తీసుకుని "టుస్కాన్ ప్రైమ్" అని నామకరణం చేశారు. (కరోనా భయం.. కారే నయం!)
అనంతరం దాన్ని ఆ షోరూమ్‌లో సేల్స్ పర్సన్‌గా నియమిస్తూ ఐడీ కార్డు కూడా జారీ చేశారు. అది కూడా ఎంతో బుద్ధిగా, బాధ్యతగా తన పనులు నిర్వర్తిస్తోంది. ఆ షోరూమ్‌కు వచ్చే వినియోగదారులు కూడా కుక్క ప్రవర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టుస్కాన్ ప్రైమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక అకౌంట్ కూడా ఉంది. దీన్ని 43 వేల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ శునకం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (నదిలో లక్ష లింగాలు: నిజమేనా?)
Comments
Please login to add a commentAdd a comment