car showroom
-
రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్..
పారిస్: ఫ్రాన్స్ దేశంలో నహేల్ అనే ఒక 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. వారం రోజులవుతున్నా ఇప్పటికింకా అక్కడ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతూ, దుకాణాలను లూటీ చేస్తున్నారు. తాజాగా కొన్ని అల్లరి మూకలు ఒక కార్ షోరూంని కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు నుండి నేటివరకు ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తూ భగ్గుమంటూనే ఉంది. ఇంతవరకు ఈ అల్లర్లలో సుమారు 1000 మందిని పోలీసులు అరెస్టు చేయగా పోలీసు బలగాల్లో 200 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోకుండా అడ్డుకునేందుకు 45000 మంది పోలీసులు పహారా కాస్తూ అల్లరిమూకలను చెదరగొడుతున్నా ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉండగా ఆందోళనకారులు పారిస్ నగరంలో ఎక్కడికక్కడ దుకాణాల్లోకి చొరబడి చేతికి దొరికిన వస్తువును తీసుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కొంతమంది నిరసనకారులు అక్కడి వోక్స్ వ్యాగన్ కార్ షోరూంని కొల్లగొట్టి అందులోని ఖరీదైన కార్లను దొంగిలించారు. ఎంత కష్టపడితే మాత్రం ఇలాంటి లగ్జరీ కార్లను కొనడానికి జీవితకాలం సరిపోదని భావించారో ఏమో. షోరూంలోనో కార్లన్నిటినీ లూటీ చేశారు. దుండగులు కార్లను ఎత్తుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనికి కామెంట్ల రూపంలో ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు వీక్షకులు. Car dealership looted in #FranceRiots. pic.twitter.com/fkKHil7H8J — Paul Golding (@GoldingBF) July 2, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
స్వావలంబన: ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు
ఆటో మొబైల్ రంగంలో మహిళలు పని చేయడం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని కాలదన్ని ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. హర్షించదగిన, ఆహ్వానించదగిన పరిణామం ఏమిటంటే ఆటో మొబైల్ రంగంలోని దిగ్గజ సంస్థలు స్త్రీ సాధికారత, స్వావలంబనకు పెద్ద పీట వేస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ను ప్రారంభించింది... మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. ‘ఇరవైమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తేలిగ్గా జరగలేదు. కష్టపడాల్సి వచ్చింది. మహిళలు ఒక బృందంగా ఒకేచోట పనిచేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవచ్చు. స్వావలంబనను బలోపేతం చేయవచ్చు. నేటి తరం మహిళలు ఇతరులపై ఆధారపడడం కంటే స్వతంత్రంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతల్లో మంచి విజయాలు సాధిస్తున్నారు’ అంటోంది షోరూమ్ జనరల్ మేనేజర్ లవ్లీసింగ్. ఆటోమొబైల్ రంగంలో లవ్లీసింగ్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సేల్స్ బృందంలో సభ్యురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది లవ్లీసింగ్. ఆ రోజుల్లో నగరం మొత్తంలో ఆటో మొబైల్ రంగానికి సంబంధించి సేల్స్ విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ లవ్లీ. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాను’ అంటే ఆశ్చర్యంగా చూసేవారు.కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ‘టీచర్ జాబ్ చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. అయితే అవేమీ తనను ముందుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాయి. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తే పదిమంది పలురకాలుగా అనుకుంటారు’ అనే భయం ఉంది. ఎన్నో అపోహలు ఉన్నాయి. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అంతమంది మగవాళ్ల మధ్య ఎలా పనిచేస్తున్నావు...’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ముందుకు వచ్చేవి. వాటిని పట్టించుకొని ఉంటే సేల్స్ విభాగంలో పనిచేసిన వారం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలి ఇంట్లో కూర్చునేదాన్ని అంటుంది లవ్లీసింగ్. ‘ఆటోమొబైల్ రంగంలో పనిచేయాలనే ఆసక్తి నాలో మొదట ఉండేది కాదు. దీనికి కారణం... పురుషులు మాత్రమే ఆ రంగంలో ఉంటారు అనుకోవడం. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఇరవైమంది సభ్యులు ఉన్న బృందంలో చేరడంతో అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో భయాలు పోయాయి. ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగంలో చేరినట్లుగా లేదు చిన్న విశ్వవిద్యాలయంలో చేరినట్లుగా ఉంది. ఇక్కడి అనుభవాలే మాకు గొప్ప పాఠాలు’ అంటుంది మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సీమ. 27 సంవత్సరాల గుర్మీత్ ఆటో మొబైల్ రంగంలోకి రావాలనుకోవడానికి ముందు– ‘అంత తేలికైన విషయం కాదు. కార్లు–హెవీ డ్యూటీ ట్రక్స్ అసెంబ్లింగ్‌లో మగవాళ్లతో పోటీపడడం కష్టం. ఇండస్ట్రీలో మొదలైన కొత్త డిజిటల్ ట్రెండ్‌ను త్వరగా అందుకోవడం ఇంకా కష్టం’లాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అయితే అలాంటి మాటలేవీ తనను ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ఎంజీ మోటర్స్ గత సంవత్సరం గుజరాత్‌లోని వడోదర ప్లాంట్‌లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను మొదలుపెట్టింది. ‘ప్రయోగాలకు, వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్ ఎంజీ. ఆల్–ఉమెన్ టీమ్ అనేది మహిళలు కష్టపడే తత్వానికి, అంకితభావానికి మేము ఇచ్చే గౌరవం’ అంటున్నాడు ఎంజీ మోటర్ ఇండియా ఎండీ రాజీవ్ చాబ. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకోనక్కర్లేకుండానే ఆటోమొబైల్ రంగంలో మహిళలకు మేలు చేసే మంచికాలం వచ్చింది. దిగ్గజ సంస్థలు ‘ఆల్–ఉమెన్ టీమ్’లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
భారత్‌లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ రెండేళ్లలో ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో 50 శాతం వాటాను అందుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 42 శాతం వాటా ఉందని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతీ కంపెనీ 2,250 నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించి ఉంది. దేశంలో 3,500వ ఔట్‌లెట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘మార్చి నాటికి కొత్తగా రెండు ఎస్‌యూవీలను పరిచయం చేస్తాం. ఎస్‌యూవీల్లో ప్రస్తుతం కంపెనీకి 14.5 శాతం వాటా ఉంది. దీనిని పెంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాం. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు 2024–25లో రంగ ప్రవేశం చేయనుంది. ఈవీల కంటే ముందుగా హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతుంది. చార్జింగ్ మౌలిక వసతులు ఉంటేనే వినియోగదార్లలో ఈవీల పట్ల విశ్వాసం ఉంటుంది. 2030 నాటికి ఈవీల వాటా 15–17 శాతానికి చేరుకోవచ్చని అంచనా. ఇక అమ్మకాల పరంగా హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంది’ అని వివరించారు. మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో తమ వాటా 2 శాతమని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ వెల్లడించారు. భారత్‌లో ఇంత విస్తృత నెట్‌వర్క్‌ను సాధించిన ఏకైక కార్ కంపెనీగా మారుతీ సుజుకీ గుర్తింపు సంపాదించుకుంది. చదవండి: వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు -
Tesla: భారత్‌లో ఆన్లైన్ ద్వారా కార్ల అమ్మకం!
ఆటోమొబైల్ రంగంలో భారీ బిజినెస్ జరిపే భారత్‌లో.. ఎలక్ట్రిక్ కార్ల లాంఛింగ్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది టెస్లా. ఈ ఏడాది చివరికల్లా ప్రతిపాదించిన నాలుగు మోడల్స్‌లో ఒకటి ఖరారై.. లాంఛ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాయితీల విషయంలో చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ప్రతినిధులు వివరణలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఫిజికల్ రిటైల్ షోరూమ్స్‌ను సొంతగా నిర్వహించేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతోంది. డీలర్ నెట్వర్క్ లేకుండా నేరుగా సొంత షోరూమ్స్ ద్వారా కార్ల అమ్మకాలు చేపట్టనున్నట్లు కేంద్రానికి స్పష్టం చేసింది. అంతేకాదు ఆన్‌లైన్‌లోనూ కార్ల అమ్మకాల్ని చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే అమెరికాలో మాత్రమే ఆన్లైన్ సేల్ చేస్తోంది. అయితే ఇప్పటికే జర్మనీతో పాటు మరికొన్ని దేశాల్లోనూ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ అవి ఆలస్యం అయితే ఆన్లైన్ సేల్స్ విభాగం ద్వారా టెస్లా, భారత్‌లో కొత్త రికార్డు సృష్టించినట్లు అవుతుంది. క్లిక్ చేయండి: టెస్లా.. భారత్‌లో రాబోతున్నవి ఇవేనా? ఇక విదేశీ కంపెనీలకు ఎఫ్‌డీఐ రూల్స్‌ను సవరించే అంశం కేంద్రం పరిధిలో ఉండగా.. సబ్బీడీలు, ఆ ఉత్పత్తులను స్థానిక ఉత్పత్తులుగా పరిగణించడం(ఇక్కడ అమ్మినా.. బయటి దేశాలకు అమ్మినా కూడా) లాంటి షరతులపై చర్చలు నడిపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఐకియా ఫిజికల్ షోరూమ్స్ ఉండగా.. ఐఫోన్ రిటైల్ ఔట్లెట్ కొవిడ్‌తో ఆలస్యమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ముచ్చటగా మూడో విదేశీ కంపెనీగా టెస్లా రిటైల్ ఔట్లెట్ నిలవనుంది. చదవండి: స్టీరింగ్ లేకుండా టెస్లా చీప్ కారు -
అప్పుడే బయటకు కొత్తకారు.. ఒక్కసారిగా మొదటి అంతస్తు పైనుంచి
సాక్షి,నాగోలు( హైదరాబాద్): మేడిపల్లికి చెందిన ఎల్ఐసీ ఉద్యోగి భగవత్ (59) అల్కాపురి చౌరస్తా వద్ద ఉన్న టాటా కార్ల షోరూంలో నూతనంగా టాటా టియాగో ఎస్టీ 1.2 కారును కొనుగోలు చేశాడు. మొదటి అంతస్తు నుంచి ఓపెన్ లిఫ్టులో తన కారును కిందికు దించుతుండగా అదుపు తప్పి కిందపడింది. దీంతో ఆయన ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనలో షోరూం కింద ఉన్న పార్కు చేసిన మరో కారు, ద్విచక్రవాహనం ధ్వంసమయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అల్కాపురి చౌరస్తాలో టాటా కార్ల షోరూం భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదన్నారు. షోరూం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓపెన్ లిఫ్టుకు కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా ఓపెన్ లిఫ్టు నిర్వహస్తున్న టాటా కార్ల షోరూంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భగవత్‌కు సరిగా డ్రైవింగ్ రాకపోవడంతోనే ప్రమాదం జరిగిందని షోరూం సిబ్బంది చెప్తున్నారు. -
షోరూం మొదటి అంతస్తు నుండి కిందపడ్డ కారు
-
కార్ల షోరూమ్‌లో సేల్స్ పర్సన్‌గా శునకం
బ్రెజిల్: షోరూమ్‌కు వెళ్లగానే అక్కడి సేల్స్ పర్సన్లు మనకు స్వాగతం చెప్తూ అవసరమైన వాటిని చూపిస్తుంటారు. అయితే హ్యుందాయ్ షోరూమ్‌లో మాత్రం ఓ వీధి శునకం మీకు సేల్స్ పర్సన్‌గా వెల్కమ్ చెప్తుంది. వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌లోని సెర్రాలో హ్యుందాయ్ షోరూమ్ దగ్గర ఓ కుక్క ఎప్పుడూ అక్కడే తచ్చాడుతూ కనిపించేది. దాన్ని చూసి అక్కడుండేవారు ఎంతో జాలిపడేవారు. అయితే రోజులు గడుస్తున్నా అది షోరూమ్ ముందు ఎదురు చూడటం మానలేదు. దీంతో ఆ షోరూమ్ వాళ్లకి కూడా జాలేసి దాన్ని దత్తత తీసుకుని "టుస్కాన్ ప్రైమ్" అని నామకరణం చేశారు. (కరోనా భయం.. కారే నయం!) అనంతరం దాన్ని ఆ షోరూమ్‌లో సేల్స్ పర్సన్‌గా నియమిస్తూ ఐడీ కార్డు కూడా జారీ చేశారు. అది కూడా ఎంతో బుద్ధిగా, బాధ్యతగా తన పనులు నిర్వర్తిస్తోంది. ఆ షోరూమ్‌కు వచ్చే వినియోగదారులు కూడా కుక్క ప్రవర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టుస్కాన్ ప్రైమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక అకౌంట్ కూడా ఉంది. దీన్ని 43 వేల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ శునకం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (నదిలో లక్ష లింగాలు: నిజమేనా?) View this post on Instagram Bom Dia meus AUmigos 🐾🐶🐕 hoje meu dia começou cedo, mas não foi nas vendas, estou tentando ler e responder as milhares, juro, milhaaaares de mensagens que recebi nos últimos dias, mas é que de onde eu vim, não tinha essa tecnologia toda, eu e meus humanos estamos tentando ainda encontrar uma forma de como lidar com tanto amor e carinho assim, se eu não abri sua mensagem ou respondi, queria pedir desculpas, mas estamos tentando ao máximo abrir todas as mensagens para tentar agradecer a todos vocês, estou muito feliz com tudo isso! Muuuitos LAMbeijos para vocês 🐶 #tucson #prime #hyundai @primehyundai A post shared by TUCSON PRIME (@tucson_prime) on Aug 5, 2020 at 5:53am PDT -
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం
-
విశాఖపట్నం కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం
-
షోరూంలో అగ్ని ప్రమాదం : నాలుగు కార్లు దగ్ధం
సాక్షి, విశాఖపట్నం : నగరంలోని ఎంవీపీ డబుల్ రోడ్డులో ప్రముఖ కార్ల కంపెనీ 'హుందాయ్' షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ షోరూంలో విక్రయించే కార్లతో పాటు సర్వీసింగ్‌కు వచ్చిన కార్లు కూడా ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దాదాపు అరగంట శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. నష్ట తీవ్రత లక్షల్లో ఉండొచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. -
చెక్కు పంపిస్తానని చెక్కేశాడు..
సాక్షి, సిటీబ్యూరో: కారు షోరూమ్ యజమానినంటూ బ్యాంక్ అధికారులకు ఫోన్లు చేసి బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పి తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు రూ.8 లక్షలు బదిలీ చేయించుకుని మోసం చేసిన ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.మూడు లక్షల నగదు, వోక్స్ వ్యాగన్ పోలో కారు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి సీపీ సజ్జనార్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు, ఓ దాడి కేసులో దస్నా జైలుకు వెళ్లిన అతడికి వీరేందర్ సాహూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి నుంచి నేరాలు చేయడంపై అవగాహన పెంచుకున్న అరుణ్‌కుమార్ తన స్నేహితులైన మోహిత్ కుమార్, మనోజ్‌కుమార్, ఢిల్లీకి చెందిన లోకేశ్ తమర్‌లతో కలిసి తొలుత వీరేంద్ర సాహూకు కమీషన్ పద్ధతిన బ్యాంక్ ఖాతాలు సమకూర్చేవారు. అనంతరం స్వయంగా మోసాలు మోదలు పెట్టిన అరుణ్ కుమార్ సైబర్ నేరాలను ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా ఇంటర్నెట్లో పలు నగరాల్లోని కారు షోరూమ్ వివరాలు సేకరించి ఆయా సంస్థల్లోని సేల్స్ టీమ్స్‌కు ఫోన్లు చేసి షోరూమ్ యజమాని పేరు, బ్యాంక్ పేరు, ఖాతాల వివరాలు సేకరించేవాడు. దీంతో పాటు కార్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పడంతో అతడి వలలో పడిన షోరూం నిర్వాహకులు క్యాన్సల్డ్ చెక్‌ను వాట్సాప్ ద్వారా పంపేవారు. పూర్తి వివరాలు సేకరించిన అనంతరం అరుణ్‌కుమార్ పథకం ప్రకారం సదరు షోరూమ్ బ్యాంక్ ఖాతా ఉన్న అధికారులకు ఫోన్ చేసి మీ బ్యాంక్‌లో భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలనుకుంటున్నట్లు చెప్పి వారిని వలలో వేసుకునేవాడు. వారు తన మాటలతో సంతృప్తి చెందినట్లు భావించిన అనంతరం ఒరిజినల్ చెక్‌ను బ్యాంక్‌కు పంపిస్తానని తన షోరూమ్ బ్యాంక్ ఖాతా నుంచి ఇతర బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమచేయించుకునేవాడు. ఇదే తరహాలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ బ్యాంక్ మేనేజర్ రూ.8,20,000 బదిలీ చేశాడు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన అతను ఈ నెల 10న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటాతో ఉత్తరప్రదేశ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్‌వారంట్‌పై మంగళవారం సిటీకి తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ‘కారు షోరూమ్ ఉద్యోగులు యజమాన్య వివరాలను గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్ లో షేర్ చేయవద్దు. వాట్సాప్‌లలో కూడా చెక్‌లు పంపవద్దు. అలాగే బ్యాంక్ అధికారులు కూడా తమ కస్టమర్లు చెక్ ఇచ్చిన తర్వాతే నగదు బదిలీచేయాలి’ అని సీపీ సజ్జనార్ సూచించారు. ముఠాను పట్టుకున్న సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. -
అగ్నిప్రమాదంలో కార్లు దగ్ధం
వరంగల్: వరంగల్ జిల్లాలో గురువారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోండా కార్ షో రూంలో మంటలు వ్యాపించడంతో ఎనిమిది కార్లు దగ్ధమయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రి సమీపంలోని గ్రీన్ హోండా కార్ షోరూంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా.. అప్పటికే షోరూంలోని ఎనిమిది కొత్త కార్లకు మంటలంటుకొని దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. -
హుదూద్ బీభత్సాన్ని కళ్ళకు కట్టే దృశ్యమిదీ!