వరంగల్: వరంగల్ జిల్లాలో గురువారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోండా కార్ షో రూంలో మంటలు వ్యాపించడంతో ఎనిమిది కార్లు దగ్ధమయ్యాయి.
ఎంజీఎం ఆసుపత్రి సమీపంలోని గ్రీన్ హోండా కార్ షోరూంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా.. అప్పటికే షోరూంలోని ఎనిమిది కొత్త కార్లకు మంటలంటుకొని దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.
అగ్నిప్రమాదంలో కార్లు దగ్ధం
Published Fri, May 12 2017 4:39 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement