ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ వైన్ షాప్లో మంగళవారం దొంగ హల్చల్ సృష్టించాడు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ వైన్ షాప్లో మంగళవారం దొంగ హల్చల్ సృష్టించాడు. వైన్ షాప్లో మద్యం సేవిస్తున్న వ్యక్తిపై దాడి చేసి... అతడి వద్దనున్న రూ. 50 వేలు బలవంతంగా లాక్కున్నాడు.అనంతరం దొంగ అక్కడి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.... నిందితుడి వివరాలు సేకరించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అతడిని బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని ... పట్టణ టూటౌన్కు తరలించారు. పోలీసులు దొంగను తమదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే వైన్ షాపులో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.