గుంటూరు: మద్యం దుకాణంలో దొంగలు పడి రూ. 2 లక్షలు దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకిరేకల్లులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
సోమవారం ఉదయం చోరీ జరిగిందని గుర్తించిన వైన్స్ వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేసిన తాళాలు వేసేనట్లే ఉన్నా దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. వైన్స్‌లో పని చేసే సిబ్బందే ఈ పనిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.