
సాక్షి, హైదరాబాద్: మద్యం షాపులను అడ్డగోలుగా పెంచేయడంతోపాటు అమ్మకాలకు సమయాన్ని పెంచుతు న్న ప్రభుత్వమే తాగినవారిని జైలుకు పంపిస్తున్నదని మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యానికి యువత దాసోహం అవుతోందని బాధ పడుతున్న ప్రధాని మోదీ మద్యంపై నిషేధం ఎందుకు విధించడంలేదని ప్రశ్నించారు. బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ మాటలు చెప్పడం తప్ప పనులు చేయడంలేదని వీహెచ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment