
సాక్షి, కృష్ణా : జిల్లాలోని కూచిపూడి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. కూచిపూడిలో ఉన్న వైన్‌షాప్ వద్ద మద్దాల కోటేశ్వరరావుపై సోమవారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడడంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. కాగా దాడిలో మృతి చెందిన కోటేశ్వరరావు మొవ్వ మండలం అయ్యంకి గ్రామానికి చెందినవాడు. కోటేశ్వరరావుపై దాడి చేసిన వ్యక్తులే ఆయన మృతికి కారణమంటూ అతని బంధువులు ఆరోపించారు. వీరికి మద్దతుగా అయ్యంకి గ్రామస్తులు మంగళవారం పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తుకు చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.