రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్ర విభజన.. మద్యం దుకాణదారులకు బంపర్ బొనాంజా ఇవ్వబోతోంది. వైన్‌షాపుల లెసైన్స్ గడువు జూన్ 30తో ముగుస్తున్నప్పటికీ.. అదనపు ఫీజు చెల్లించి మరో మూడు నెలల పాటు మద్యం అమ్మకాలు కొనసాగించుకునే వెసులుబాటు రాబోతుంది. జూన్ 2 నుంచి రాష్ట్ర విభజన అధికారికంగా అమలులోకి వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రాలు ఏర్పాటవుతుండటంతో కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
మద్యం లెసైన్సులకు సంబంధించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పాటించే తుది గడువు ‘జూన్ 30’ లోగా రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొత్త మద్యం విధానాన్ని రూపొందించి అమలు చేయటం కష్టమని అధికార యంత్రాంగం భావిస్తోంది. రెండు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే ఎక్సైజ్ శాఖ విషయంలో ప్రస్తుత అధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో.. ఈ ఏడాది ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లెసైన్సులనే మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
మద్యం లెసైన్సులు 3 నెలల పొడిగింపు!
Published Wed, May 21 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement