సాక్షి, నెల్లూరు: నెల్లూరు జగదీష్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు.మహిళలు, స్థానికులు షాపు వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో తీవ్రతరంగా మారింది దుకాణం కౌంటర్ వద్దకు వెళ్లి నిర్వాహకులను హెచ్చరించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం షాపు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఇప్పటికైనా దుకాణాన్ని తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జగదీష్‌నగర్‌లో మద్యం షాపు వద్ద స్థానికుల ఆందోళనకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.
ఇదిలా ఉండగా వైన్ షాప్ నిర్వాహకునికి మద్దతుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అంతేగాక మహిళను బెదిరించేందుకు వైన్‌షాప్ నిర్వాహకులు రౌడీలను తీసుకొచ్చారు. మరోవైపు షాప్ మూసేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. తమకు ళలకు అన్యాయం జరిగితే రాని పోలీసులు.. మద్యం షాప్ ఓనర్‌కు మద్దతుగా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment