women proetst
-
AP: ఉద్రిక్తత.. వైన్‌షాప్ మూసేయాలని మహిళల ఆందోళన
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జగదీష్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు.మహిళలు, స్థానికులు షాపు వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో తీవ్రతరంగా మారింది దుకాణం కౌంటర్ వద్దకు వెళ్లి నిర్వాహకులను హెచ్చరించారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం షాపు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఇప్పటికైనా దుకాణాన్ని తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జగదీష్‌నగర్‌లో మద్యం షాపు వద్ద స్థానికుల ఆందోళనకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.ఇదిలా ఉండగా వైన్ షాప్ నిర్వాహకునికి మద్దతుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అంతేగాక మహిళను బెదిరించేందుకు వైన్‌షాప్ నిర్వాహకులు రౌడీలను తీసుకొచ్చారు. మరోవైపు షాప్ మూసేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. తమకు ళలకు అన్యాయం జరిగితే రాని పోలీసులు.. మద్యం షాప్ ఓనర్‌కు మద్దతుగా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’
రబ్బరు బంతిని ఎంత బలంగా నేలకు కొడితే అంతే వేగంగా పైకి లేస్తుంది... జీవం లేని వస్తువే అంతటి ప్రతిఘటన చూపిస్తే.. మరి ప్రాణమున్న మనుషుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అణచివేత ధోరణికి పోరాటాలతో చరమగీతం పాడి హక్కులు సాధించుకున్న అనేకానేక స్ఫూర్తిదాయక కథలను చరిత్ర తన కడుపులో దాచుకున్నది. ఆధిపత్య భావజాలానికి ఎదురొడ్డి హక్కుల సాధనకు కృషి చేసిన మహనీయుల గాథలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటుంది. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి మహిళలు ఇప్పుడు మరోసారి తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వస్త్రధారణ, విద్య, ఉద్యోగం వంటి అంశాల్లో తాలిబన్లు అనుసరిస్తున్న వైఖరికి గట్టిగానే సమాధానం చెబుతున్నారు. నిజానికి ఆగష్టు 15న రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్ల గత అరాచక పాలనను గుర్తుచేసుకుని దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ఎంతగా బెంబేలెత్తిపోయారో ప్రపంచం మొత్తం చూసింది. తాము మరోసారి నరకంలోకి వెళ్లడం ఖాయమని వారు చేసిన వ్యాఖ్యలు వారి దుస్థితికి అద్దం పట్టాయి. అలాంటి సమయంలో తమ తొట్టతొలి మీడియా సమావేశంలో మహిళలపై ఎలాంటి వివక్ష చూపబోమంటూ తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అది కేవలం మాటల వరకే పరిమితమని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తూ ఫత్వా జారీ చేయడం, తమ ప్రభుత్వంలో మహిళలకు ఉన్నత పదవులు(మంత్రి) ఉండవని చెప్పడం స్త్రీల పట్ల వారు అనుసరించబోయే విధానాలను చెప్పకనేచెప్పాయి. ముఖ్యంగా పురుషుల తోడు లేకుండా ఆడవాళ్లు బయటకు రావద్దని చెప్పడం, వస్త్రధారణ పట్ల ఆంక్షలు విధించడం షరా మామూలే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల కట్టుబాట్లకు తలొంచేది లేదని, తమ స్వేచ్చకు భంగం కలిగితే ఊరుకునేది లేదని గట్టిగానే గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలు నిరసనలు చేపట్టిన స్త్రీలు.. సోషల్ మీడియా వేదికగా మరో ఉద్యమానికి తెరతీశారు. అఫ్గన్ సంస్కృతి ఇదే! సుదీర్ఘ కాలంగా అంతర్గత విభేదాలు, విదేశీ జోక్యంతో అతలాకుతలమైన అఫ్గనిస్తాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. ముఖ్యంగా 1950, 1960లలో పెద్దఎత్తున మార్పులతో మరింత ఉదార, పాశ్చాత్య జీవనశైలి విధానాలు అవలంబించే దిశగా పాలకులు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే వీలు కలిగింది. కానీ, 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల పాలనలో ఇవన్నీ తలకిందులయ్యాయి. షరియా చట్ట ప్రకారం పాలించిన తాలిబన్లు.. బుర్ఖా విషయంలో కఠిన నిబంధనలు అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే వైఖరిని అవలంబిస్తే సహించేది లేదంటున్నారు అక్కడి మహిళలు. ‘#Afghanistanculture పేరిట ట్విటర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. #DoNotTouchMyClothes అంటూ తమ వస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు అఫ్గన్ సంప్రదాయ దుస్తులు ధరించిన తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. హక్కుల పోరాటానికై మీరు చేసే ఉద్యమంలో మావంతు సాయం చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. -వెబ్‌డెస్క్ This is another traditional Afghan dress from a different part of Afghanistan. I was a teenager in this pic. We will not let our culture to be appropriated by those who want to erase us. #DoNotTouchMyClothes #AfghanistanCulture pic.twitter.com/dMwnBS7vuT — Dr. Bahar Jalali (@RoxanaBahar1) September 12, 2021 Afghan women, cultural campaign, traditional dress.#AfghanistanCulture 🇦🇫 pic.twitter.com/Qey9mdzVDT — Mustafa Kamal Kakar (@MustafaKamalMKK) September 12, 2021 Black attire, Burqa, and Niqab are not and never been part of the Afghan Culture. Here's a few different types of traditional Afghan attire for women. It's colourful, modest, practical, and more importantly beautiful.#AfghanistanCulture #AfghanWomen #TalibanTerror https://t.co/OYs89B24LC pic.twitter.com/s8hq0CWaij — Zahra Sultani | زارا سلطانی (@zahrasultani_) September 12, 2021 చదవండి: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో హైదరాబాదీ! -
తాలిబన్లకు ఊహించని ఝలక్
ఇరవై ఏళ్ల స్వేచ్ఛకు కళ్లెం వేయాలనే ప్రయత్నానికి అఫ్గన్ మహిళ ఎదురు తిరిగింది. తాలిబన్ల దురాక్రమణ జరిగిన మరుక్షణం నుంచి అఫ్గన్ నేలపై మహిళా భద్రత గురించి ఆందోళన వ్యక్తం అయిన విషయం తెలిసిందే. అణచివేత పరిణామాలు ఉండబోవని ఓవైపు చెబుతూనే.. మరోవైపు కట్టడికి తాలిబన్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ తరుణంలో హక్కుల కోసం అఫ్గన్ మహిళలు గళం లేవనెత్తారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ వేల మంది అఫ్గన్ మహిళలు ర్యాలీలు చేపడుతున్నారు. ‘‘మేం అసహనంలో ఉన్నాం’’.. ఈ ఫ్లకార్డులతో ప్రస్తుతం అఫ్గన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది అఫ్గన్ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. అఫ్గన్ పశ్చిమ ప్రాంతంలోని చాలా ఊళ్లలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మూడో అతిపెద్ద పట్టణం అయిన హెరాత్‌లో యాభై మంది మహిళలు మొదలుపెట్టిన నిరసన ప్రదర్శన.. మిగతా మహిళల్లో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపింది. ఉద్యోగాల నుంచి తమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వాళ్లు. ‘‘తాలిబన్ల ఆక్రమణ పరిణామాల తర్వాత యావత్ అఫ్గన్ మహిళా లోకం నాలుగు గోడల నడుమే బంధి అయిపోయింది. ఈ పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో కుటుంబాలను దిగజారుస్తోంది. ఇంట్లో ఆడవాళ్లు పని చేస్తేనే గడవని కుటుంబాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు దిగజారకముందే తమను పనులకు అనుమతించాల’’ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ప్రభుత్వమేదైనా.. ప్రజాస్వామ్యయుతంగా అఫ్గన్‌ను చూడాలనుకుంటన్నట్లు వాళ్లు కోరుకుంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మరోపక్క ఆడవాళ్లు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి తమ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాబోవని, వాళ్లకు ఆ స్వేచ్ఛ ఉందని తాలిబన్లు ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు మహిళా నిరసనకారులు. ‘‘తాలిబన్లవి అబద్దపు ప్రచారాలు. ఆడవాళ్లను అసలు ఆఫీసుల్లోకి అనుమతించడం లేదు. కాదని వెళ్లే ప్రయత్నాలు చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఆడ పిల్లలను స్కూల్స్, కాలేజీల్లోకి అనుమతించలేదు. ఇదేనా వాళ్లిచ్చే స్వేచ్ఛ’’ అంటూ తాలిబన్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే ! విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ఇప్పటికే తాలిబన్ల సమావేశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోగా.. క్యాబినెట్లోనూ మహిళలకు చోటు దక్కకపోవచ్చనే సంకేతాలిస్తుండడంపై అఫ్గన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హక్కుల్ని రక్షించుకోవడం కోసం చావడానికైనా సిద్ధం అని ప్రకటించుకుంటున్నారు వాళ్లు. మరోవైపు కుటుంబాలతో సహా ఆడవాళ్లు నిరసనల్లో పాల్గొంటున్నారు. ‘‘బుర్ఖాలకు మేం సిద్ధం. ప్రతిగా తమ ఆడబిడ్డలను చదువు, ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని కొందరు తల్లులు, తాలిబన్లను డిమాండ్ చేస్తున్నారు. కాబూల్‌లో కిందటి నెలలో ఇలాంటి ర్యాలీ ఒకటి జరిగింది. అయితే తాలిబన్లు సమర్థవంతంగా ఆ ఉద్యమాన్ని అణచివేశారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలైన క్రమంలో ఊహించని పరిణామాలు ఎదురుకావడం తాలిబన్లకు మింగుడు పడడం లేదు. చదవండి: తాలిబన్ చీఫ్ అఖుంద్జాదా గురించి ఆసక్తికర విషయాలు -
ఇది మహిళా నాయకత్వ సంవత్సరం
ఓ ఏడాది వచ్చినట్టు మరో ఏడాది మార్చి 8 ఉండదు. నూట పది సంవత్సరాల మార్చి ఎనిమిది శ్రామిక మహిళల సంఘర్షణల మైలురాళ్లు నాటుకుంటూ వస్తున్నది. గతేడాది పౌరసత్వం మా హక్కంటూ గడగడ వణికించే చలిలో రోడ్డుపై నిరవధిక శాంతియుత సత్యాగ్రహానికి కూర్చున్న వేలాదిమంది మహిళల పట్టుదల నివ్వెరపరిచింది. అబద్ధపు ప్రచారాలనీ, విద్వేషపు దాడుల్నీ, అనేక కుట్రల్నీ తట్టుకుంటూ దాదాపు మూడునెలలు దేశవ్యాప్తంగా వందల బైఠాయింపులు జరిగాయి. అవన్నీ దాదాపుగా మహిళల చొరవతో, మహిళల నిర్వహణతో నడచినవే. దేశ చరిత్రలో మొదటిసారి పురుషులు సహకార భూమికలో దర్శనమిచ్చారు. ఇప్పుడు నాలుగో నెలలోకి చేరిన రైతుల సత్య సంగ్రామానికి పునాది షాహీన్‌బాగ్. ధరల నిరంతర పెరుగుదల, కోల్పోయిన ఉపాధి, మూతబడిన సూక్ష్మ, చిన్న, మధ్య గృహ పరిశ్రమలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇంటాబయటా పెరిగిపోతున్న హింస... వీటితో విసిగి అధికార నిచ్చెనలో అట్టడుగున ఉండే మహిళలు ‘ఇక చాలు’ అంటున్నారు. వ్యవసాయ ఆర్డినెన్స్‌లు వచ్చిన నాటి నుండి మహిళా రైతులు, కూలీలు వాటిని అర్థం చేసుకున్నారు. ‘మా పొలాల్లో మేమే కూలీలుగా మారే కార్పొరేటు, కాంట్రాక్టు వ్యవసాయ విధానం’ వద్దన్నారు. ఊరూరు, ఇల్లిల్లూ తిరిగారు. ఈ చట్టాల గురించి వివరించారు. ఊరేగింపులు చేశారు. టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు చేశారు. ఢిల్లీకి చేరారు. ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. భయపడలేదు. నిరంతరాయంగా సాగుతున్న ఢిల్లీ సరిహద్దుల ముట్టడిలో వారు వేదిక నిర్వాహకులు, స్త్రీల ప్రత్యేక కార్యక్రమాల రూపకర్తలు, తీర్మానాల రచయిత్రులు, యాంకర్లు, ఎకౌంటెంట్లు, వంటలక్కలు, పది చేతుల్తో పనులు చక్కబెట్టే ఉద్యమకారులు. లంగరు (సామూహిక వంటశాల)లో ఎక్కువ భాగం పనులన్నీ పురుషులే చేయటం గమనార్హం. ఎక్కడ అవసరం అయితే అక్కడికి ట్రాలీల నిండా వండిన ఆహారంతో ట్రాక్టరు స్వయంగా నడుపుకుంటూ పోయే 80 ఏళ్ల నవనీత్ సింగ్ చాలా మామూలుగా చెబుతుంది, ‘నా భర్త పోయాక నేనే 50 ఏళ్లుగా వ్యవసాయం చేసి కుటుంబాన్ని ఒక దారికి తెచ్చాను. ఈ చట్టాలతో నా కుటుంబ ఆధారమే నేలమట్టం అవుతుంది. ఎంతకాలం అయినా పట్టని చట్టాలు వాపస్ తీసుకోవాల్సిందే’ అని. అసంఖ్యాకమైన స్త్రీల మాదిరి గానే ‘బతకడం కోసం ఏది అవసరం అయితే అది చెయ్యాలి’ అనేది ఆమె జీవన సూత్రం. మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది కాబట్టే ఈరోజు స్త్రీలు ఉద్యమాల అనుచరులుగా, సహచరులుగా ఉండే పాత్రనుదాటి రూపకర్తలుగా, సమన్వయకారులుగా నిలబడుతున్నారు. వంటపని, ఇంటిపని, పిల్లల పెంపకం, వృద్ధుల సేవలు, బయట ఉపాధి వ్యవహారం... బహుళ ముఖ్యమైన పనులు ఒకేసారి చక్కబెట్టే వారి సామర్థ్యం ఉద్యమాల్లో భిన్న పాత్రలు అలవోకగా పోషించడానికి అనుభవాన్నిచ్చింది కనుకనే వంతులవారీ సరిహద్దుల ముట్టడిలో వుంటూ, ఊరేగింపులు, ధర్నాలు స్థానికంగా నిర్వహిస్తూ... వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉద్యమాల కోసం వెళ్లిన సహచరుల చేలను కూడా పండిస్తున్నారు. భారీ మద్దతు ఒకప్పుడు ఖాప్ పంచాయతీల్లో స్త్రీలకు ప్రవేశం లేదు. అక్కడ స్త్రీలకు ప్రతికూల నిర్ణయాలే ఎక్కువ. ఇవాళ కిసాన్ పంచాయతీల్లో మేలిముసుగులు తొలగించి రాజపుత్రులు, జాట్ స్త్రీలే కాకుండా దళిత మహిళలు సైతం వేదికలెక్కి ఉపన్యాసాలిస్తున్నారు. తీర్మానాలు చేస్తున్నారు. శతాబ్దాలుగా కరడుగట్టిన ఆధిపత్య వ్యవస్థల్ని ఈ ఉద్యమం బీటలు వారుస్తున్నది. విచిత్రంగా ప్రపంచ వేదిక నుండి ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది కూడా ప్రధానంగా ప్రాచుర్యంగల స్త్రీల నుంచే. ఒక రియానా, ఒక గ్రేటా థన్‌బర్గ్ అధికార పీఠం కింద భూకంపం పుట్టించారు. విశ్వవిద్యాలయాల ఉద్యమం నుండి నేటి రైతు ఉద్యమం దాకా యువతులపై, స్త్రీలపై ప్రభుత్వ దాడులు అరెస్టులు సర్వసాధారణం అయ్యాయి. కార్మిక కర్షక సమన్వయానికి ప్రతీకగా నిలిచిన నవదీప్కౌర్తో పాటు హిందీ సినీ మహిళా తారలు కూడా ప్రభుత్వ కక్ష సాధింపులకు ఎరవుతున్నారు. రైతులకు మద్దతు ఇవ్వడమే వారి పాపం. కరోనా కాలంలో అంతులేకుండా పెరిగిపోయిన గృహ హింస, ఇంటి చాకిరీకి తోడు మానసిక, శారీరక, లైంగిక హింస... పడిపోయిన ఆదాయాలు, గందరగోళం అయిన విద్యా సామాజిక జీవనం, అన్నింటినీ తట్టుకుని కుటుంబాలను సాధారణ స్థితికి చేర్చడానికి స్త్రీలు తాపత్రయపడ్డారు. గత సంవత్సరం వారి అస్తిత్వమే ఒక పోరాటంగా మారింది. అయినా స్త్రీలు ఓడిపోవడానికి నిరాకరించారు. డెన్మార్క్, ఇథియోపియా, ఫిన్లాండ్, జర్మనీ, ఐస్లాండ్, న్యూజిలాండ్, స్లోవాకియాతోపాటు 20 దేశాలకు అధినేతలుగా ఉన్న మహిళలు కోవిడ్‌కు సత్వరంగా స్పందించారు. సమర్థవంతంగా నివారించారు. కనుకనే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, ఈ ఏడాది మార్చి 8ని ‘నాయకత్వంలో స్త్రీలు– కోవిడ్ 19 ప్రపంచంలో సమానత్వ సాధన కోసం’ అనే నినాదంతో జరుపుకోవాలని పిలుపిచ్చింది. ‘మీటూ’ ప్రియారమణికి, పర్యావరణ కార్యకర్త దిశా రవికి న్యాయస్థానాలిచ్చిన తీర్పులు స్త్రీలు తమపై జరిగే హింసపై మాట్లాడటానికి, భూమిపై తమ హక్కును ప్రకటించడానికి భరోసా కల్పించాయి. బాధితులయిన పసిబిడ్డల్ని అక్కున చేర్చుకోవాల్సిన చట్ట చౌకీదారు నేరస్తులకు సానుభూతి చూపింది. కానీ, మెలకువలో ఉన్న మహిళా ఉద్యమం ఎటువంటి ‘పెడ’ ధోరణుల్ని సహించనని నిర్ద్వంద్వంగా స్పందించింది. ఈ ఏడాది ఉద్యమకాలం, ఈ మార్చి 8 మహిళా నాయకత్వ విజయం. రైతులు, కార్మికులు, విద్యార్థినులు, మేధావులు అందరూ ఉద్యమకారులుగా బరిలో నిలిచిన సందర్భం. భయాన్ని కోల్పోయేంతగా భయపెడితే మీకు వణుకుపుట్టిస్తాం అని నిర్బంధాలకూ, విద్వేషాలకూ మహిళలు ఐక్యంగా తెగేసి చెప్పిన ఏడాదికి జేజేలు. – దేవి, సాంస్కృతిక కార్యకర్త -
భర్త కోసం మౌన పోరాటం
సాక్షి, అనంతపురం : ‘పరాయి మహిళ మోజులో పడి నా భర్త నన్ను కాదంటున్నాడు.. పోలీసులు, పెద్ద మనుషులు పంచాయితీ చేసినా వినిపించుకోలేదు... న్యాయం కోసం వస్తే అత్తింటి వారు గెంటేశారు’ అని జానగాని వరలక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మండలంలోని హంపాపురంలో ఉన్న తన భర్త ఇంటి ముందు ఆమె భర్త, ఇద్దరు కుమారులు కావాలని దీక్షకు కూర్చుంది. ఆమెకు పలువురు మహిళలు బాసటగా నిలిచారు. జానగాని వరలక్ష్మి తెలిపిన వివరాలమేరకు.. బుక్కరాయసముద్రం మండలం బాట్లో కొత్తపల్లి గ్రామానికి చెందిన యల్లప్ప, ఈశ్వరమ్మ దంపతుల కుమారై వరలక్ష్మిని హంపాపురానికి చెందిన కాటమయ్య, ఆదెమ్మల కుమారుడు జానగాని సాంబశివాతో 2013లో వివాహం చేశారు. రూ.4 లక్షలు , 16 తులాల బంగారు నగలు కట్నకానులు ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్ (7), కౌసిక్ (5) సంతానం. సాంబశివ అనంతపురంలో ఫొటో స్టూడియో పెట్టుకుని జీవనం చేస్తున్నాడు. పెళ్లి అయిన ఐదేళ్లు అతను భార్యతో బాగానే ఉన్నాడు. అయితే అతని ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఆమె భర్తపై నిఘా పెట్టగా అనంతపురంలో ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయమై వరలక్ష్మి భర్తను ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. ఈ విషయంపై పోలీసులు సాంబశివకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. భార్య తనను పోలీసులతో కొట్టించిందన్న కోపంతో భర్త ఇద్దరు కుమారులను తీసుకొని అనంతపురానికి వెళ్లాడు. నాలుగు నెలల పాటు భర్త ఇంట్లోనే ఉంటున్నా భర్త, పిల్లలు గ్రామానికి తిరిగి రాకపోయే సరికి ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఆఖరికి ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి నాలుగు నెలలు అవుతున్న ఒక పక్క భర్త, మరో పక్క పిల్లలు గుర్తుకు రావడంతో మరోసారి ఆత్మహత్యయత్నం చేసుకోబోయింది. ఆఖరికి మంగళవారం ఉదయం హంపాపురానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆమె అత్త ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో భర్త ఇంటి ముందే దీక్షకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. ఇరువురిని పిలిపించి విచారిస్తామని, అవసరమైతే జానగాని వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
ఎందుకు అడ్డుకుంటున్నారు?
ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఆలయాల్లోకి ప్రవేశం మాత్రం లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆధునిక మహిళలు. సుప్రసిద్ధ ఆలయాల్లోకి తాము వెళ్లకుండా అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శబరిమల, శని సింగనాపూర్ ఆలయాల్లోని ప్రవేశించకుండా తమపై ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తున్నారు. మగాళ్లతో సమానంగా తమకు ఆలయ ప్రవేశం కల్పించాలని పోరాడుతున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు పడతులు ప్రయత్నం చేయడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సనాతన వాదులు ఈ చర్యను తప్పుబడుతున్నారు. ఆచార వ్యవహారాలను మంటగలుపుతూ పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వందలాది ఏళ్లుగా నిష్టగా ఆచరిస్తున్న ఆచారాలను ఉల్లంఘించడానికి తాము సిద్దంగా లేమని శని సింగనాపూర్ ఆలయ ధర్మకర్తలు చెబుతున్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్టతలు, పద్ధతులు ఉంటాయని వాటిని పాటించాలని అంటున్నారు. ఆలయంలో కొనసాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని సింగనాపూర్ ఆలయ బోర్డు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనితా సేథే చెప్పడం గమనార్హం. సమాన హక్కుల కోసం పోరాడుతుంటే తమపై నిందలు వేస్తారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. దేవుడి ముందు అంతా సమానమే అయినప్పుడు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీస్తున్నారు. పౌర హక్కులు, మత స్వేచ్చను హరించేందుకు ఎవరికీ హక్కు లేదని వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని క్లాజ్ 20(బీ) ఆర్టికల్ 25 మతస్వేచ్ఛ ను కాపాడాలని చెబుతోందని గుర్తు చేస్తున్నారు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి తమను అనుమతించాలని తాజాగా ముస్లిం మహిళలు పోరాటం ప్రారంభించారు. తమను దర్గాలోకి రానివ్వకుండా అడ్డుకోవడం వెనుక పితృస్వామ్య ఆధిపత్యం ఉందని, తమపై నిషేధం విధించాలని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదని వారంటున్నారు. ఈ వివాదంపై అనుకూల, ప్రతికూల వాదనలతో సోషల్ మీడియాలో వాడివేడీగా చర్చలు నడుస్తున్నాయి. రైట్ టు ప్రే, రైట్ టు వర్షిప్ హాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. పురుషులను అనుమతించని ఒక్క హిందూ దేవాలయం కూడా లేదు, మరి మహిళలకు ఆంక్షలు ఎందుకుని కిరణ్ బేడీ ట్వీటర్ లో ప్రశ్నించారు. లక్ష్మి, దుర్గ, సరస్వతి దేవతలను శక్తి, సిరిసంపదలు, చదువుల కోసం పూజించే ఆచారమున్న దేశంలో మహిళలపై వివక్ష ఎలా చూపుతారని బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు. అయితే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సూచించారు. తమపై విధించిన ఆంక్షల సంకెళ్లను తెంచడానికి ఇంకెంత కాలం పోరాటం చేయాలని మహిళా లోకం ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.