గంగవరం మండలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణం
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడబోమని, పేదల జీవితాలను రోడ్డున పడేస్తున్న మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామని హామీ ఇచ్చిన వైఎస్.జగన్‌మోహ న్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి అడుగుగా జిల్లాలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించారు. 2024 నాటికి మద్యాన్ని కేవలం ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడుతూ చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ఆదివారం 55 ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి.
చిత్తూరు అర్బన్:జిల్లాలో గత ప్రభుత్వం మద్యం దుకాణాలకు ఉన్న పరిమితులను ఎత్తేస్తూ ఇష్టానుసారంగా లైసెన్సులు జారీ చేసింది. తద్వారా గుడి, బడి, రహదారుల వెంబడి ఏకంగా 430 మద్యం దుకాణాలు వెలశాయి. దీనికితోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రతి గ్రామంలో కనీసం ఐదు వరకు బెల్టు దుకాణా లు ఏర్పాటు చేసి, ఆ పార్టీ నాయకులకు ఉపాధి కేంద్రాలను కల్పించారు. ఫలితంగా మద్యానికి బానిసవుతున్న పేదల కుటుంబాలను రోడ్డున పడేసిన దృశ్యాలు కోకొల్లలు. మద్యపానాన్ని కొందరికే పరిమితం చేసి, పేదలకు దాన్ని దూరం చేస్తామని మాటిచ్చిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఉన్న దుకాణాల్లో 20 శాతం తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మద్యం లైసెన్సులు దక్కించుకున్న వారికి దాసోహమంటూ సాగిలపడ్డ గత పాలకుల వైఖరిని పూర్తిగా పక్కన పెడుతూ ఆదాయం లేకున్నా పర్లేదని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పా టు చేశారు. దీనివల్ల జిల్లా నుంచి ప్రభుత్వానికి ఏటా రూ.వందల కోట్లలో ఆదాయం పోతున్నా పేదల కుటుంబాల్లో మద్యం రాకాసిని పారదో లేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
కిక్కు దిగాల్సిందే
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఇప్పటికే ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నిరుద్యోగుల ఎంపిక, శిక్షణ పూర్తి చేశారు. మరో రెండు రోజుల్లో వీరు దుకాణాల్లో పనిచేయనున్నారు. దుకాణాలన్నీ ప్రభుత్వానివే కావడంతో అమ్మకాల్లోనూ సర్కారు కఠినంగా వ్యవహరి స్తోంది. జిల్లాలోని 55 మద్యం దుకాణాల్లో 21 ఏళ్లలోపు వయసు వారికి మద్యం విక్రయించవద్దని నిబంధనలు విధించారు. ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉన్న మద్యం విక్రయ వేళల్లో గంట కాలాన్ని కుదించారు. దుకాణాలన్నీ రాత్రి 9 గంటలకే మూసేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని దుకాణాల్లో తప్పనిసరిగా ఎమ్మార్పీని అమలు చేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో ఏర్పాటు
జిల్లాలోని తిరుపతి ఎౖసజ్ పరిధిలో 34 ప్రభుత్వ దుకాణాలు తెరుచుకున్నాయి. పాకాల సర్కిల్‌లో 5, శ్రీకాళహస్తి 5, సత్యవేడు 6, పుత్తూరు 8, తిరుపతి అర్బన్ 4, తిరుపతి రూరల్‌లో 3 దుకాణాలున్నాయి. చిత్తూరులో 21 దుకాణాలు ఏర్పాటవగా చిత్తూరు రూరల్‌లో 6, మదనపల్లె 1, ములకలచెరువు 3, పుంగనూరు 4, పలమనేరు 2, వాయల్పాడులో ఒక దుకాణం ఏర్పాటు చేశారు.
వచ్చేనెల 286 దుకాణాలు
గతంలో ఉన్న 430 దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా 20 శాతం దుకాణాలను తొలగించనుంది.ప్రస్తుతం జిల్లాలో ఉన్న 55 మద్యం దుకాణాలకు అదనంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మరో 286 దుకాణాలు ఏర్పాటుకానున్నాయి. ఇలా ఏటా 20 శాతం దుకాణా లు తగ్గించి, రానున్న ఐదేళ్లలో అన్ని దుకాణా లను తీసేసి, స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యాన్ని అందుబాటులో ఉంచనుంది.
Comments
Please login to add a commentAdd a comment