బాల కార్మికుడిపై దాష్టీకం! | Police hit child worker! | Sakshi
Sakshi News home page

బాల కార్మికుడిపై దాష్టీకం!

Published Thu, Oct 30 2014 2:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

Police hit child worker!

విజయవాడ: ఓ బాల కార్మికుడిపై వైన్ షాపు యజమానితోపాటు పోలీసులు కూడా దాష్టీకం ప్రదర్శించారు. కంకిపాడులోని వైన్ షాపులో ఓ బాల కార్మికుడు పని చేస్తున్నాడు. ఆ షాపులో 50 వేల రూపాయలు ఎవరో చోరీ చేశారు. షాపు నిర్వాహకుడు నాగేశ్వర రావు బాల కార్మికుడిని అనుమానించాడు. చిన్న పిల్లవాడని కూడా చూడకుండా దారుణంగా చితకబాదాడు.

ఆ తరువాత ఆ బాల కార్మికుడిని నాగేశ్వర రావు పెనమలూరు పోలీసులకు అప్పగించాడు.  చివరకు పోలీసులు కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆ బాలుడిని చితకబాదారు. బాలుడి తల్లిదండ్రులు లేబర్ కమిషన్ను ఆశ్రయించారు. వాళ్లు ఏం చేస్తారో చూడాలి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement