లిక్కర్ వ్యాపారులకు బార్‌కోడ్ బాదుడు | Liquor retailers to stroke bar code | Sakshi
Sakshi News home page

లిక్కర్ వ్యాపారులకు బార్‌కోడ్ బాదుడు

Published Thu, Jan 21 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

లిక్కర్ వ్యాపారులకు బార్‌కోడ్ బాదుడు

లిక్కర్ వ్యాపారులకు బార్‌కోడ్ బాదుడు

నెలకు రూ. 5 వేల వసూలు
సరిగా పనిచేయని సాఫ్ట్‌వేర్
ఐఎంఎల్ డిపో వద్ద పడిగాపులు
వైన్‌షాపుల్లో కొనుగోలు చూపినా
స్టాక్ బ్యాలెన్సు చూపని వైనం

 
గుడివాడ: లిక్కర్ వ్యాపారులకు బార్ కోడ్ స్కానర్ విధానం తలనొప్పిగా మారింది. అది సరిగా పనిచేయక పోయినా నెలనెలా సంబంధిత సాఫ్ట్‌వేర్ కంపెనీ మాత్రం అద్దె పేరుతో నెలకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ సరిగా లేకపోవడంతో ఐఎంఎల్ డిపో వద్ద సరుకు కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైటెక్ విధానం సాఫ్ట్‌వేర్ కంపెనీకి వరంగాను లిక్కర్ వ్యాపారులకు తలనొప్పిగాను మారింది.  ఏడు నెలలుగా  ఇబ్బంది ఎదుర్కొంటున్నా పట్టించుకున్న నాథుడే లేడని లిక్కర్ వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

బార్ కోడింగ్ బాదుడు ఇలా..
మద్యం అమ్మకాలు ఆన్‌లైన్ చేసేందుకు బార్‌కోడింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బార్‌కోడ్ స్కానర్, కంప్యూటర్ కోసం ఒక్కో షాపు యజమాని రూ. ఒక లక్షా రెండు వేలకు చెక్కులను గ్యారెంటీ రూపంలో అందించారు. దీని సాఫ్ట్‌వేర్ కాంట్రాక్టును సీటెల్ కంపెనీ తీసుకోగా వైన్‌షాపుల్లో కంప్యూటర్లు అమర్చి బార్‌కోడ్ స్కానర్లు ఇచ్చారు. నిర్వాహణను కార్వే కంపెనీ తీసుకుంది. ప్రతి షాపునకు కంప్యూటర్లు, బార్‌కోడ్ స్కానర్లు ఇచ్చారు. బార్‌కోడ్ స్కానింగ్ అయిన అనంతరమే మద్యం విక్రయించాల్సి ఉంది. లిక్కర్ డిపో వద్ద కూడా ఇదే తరహాలో బార్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తేనే సరుకు బయటకు ఇస్తారు. ఆన్ లైన్ సరిగా లేకపోవడంతోపాటు, బార్‌కోడ్ సాఫ్ట్‌వేర్ ఇబ్బందుల కారణంగా వారంలో రెండు, మూడు సార్లయినా లిక్కర్ గోదాము వద్ద సరుకు కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది.  డిపో వద్దకు సరుకు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రి వరకు వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు.
 
నెలకు రూ.4,999 బాదేస్తున్నారు

జిల్లాలో ఉన్న 301 వైన్‌షాపులకు ఈ బార్‌కోడ్ స్కానర్లును అమర్చారు. ఇంకా 167 బార్లకు బార్‌కోడ్ స్కానర్లు ఇచ్చినా అవి అమర్చలేదు. ప్రస్తుతం అమర్చిన వైన్‌షాపుల నుంచి నెలకు బ్యాంకు అకౌంటు ద్వారా ఒక్కోషాపునకు రూ.4999 నేరుగా ఖాతా నుంచి తీసేసుకుంటున్నారు. స్కానర్లు కొన్ని బ్రాండ్లను ఆన్‌లైన్లో ఫీడ్ చేయకపోవడంతో ఐఎంఎల్ డిపో వద్ద స్కాన్ చేసినా తీసుకోవడం లేదని చెబుతున్నారు. వీటిలో ఎంసీ లగ్జరీ, ఓటి, ఆఫీసర్స్ చాయిస్ తదితర బ్రాండ్లను ఆన్‌లైన్‌లో స్కానింగ్ అంగీకరించ డం లేదు.  కార్వే కంపెనీ ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో అమ్మకాలు వస్తున్నాయి కానీ ఆన్‌లైన్‌లో బ్యాలెన్సు షీటు రావడం లేదని చెబుతున్నారు. దీంతో ఒక్కో వైన్ షాపు యజమాని వద్ద ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున స్టాక్ ఉన్నట్లు చూపిస్తోంది. పూర్తిస్థాయిలో సాఫ్ట్‌వేర్ పనిచేయకపోయినా తమ వద్ద ఇలా వసూలు చేయడంపై వైన్‌షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ను సరిచేయాలని కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement