Liquor merchants
-
Visakhapatnam: 30 షాపులకు దరఖాస్తు చేసిన ఒడిశా మద్యం వ్యాపారి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో మద్యం వ్యాపారంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న సిండికేట్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఒడిశాకు చెందిన వ్యాపారి వివేక్ సాహు సిండికేట్‌కు ఊహించని షాక్‌నిచ్చారు. నోయిడాకు చెందిన కొంత మంది మద్యం వ్యాపారులు కూడా ఇక్కడ వ్యాపారంపై కన్నేశారు. విశాఖలో మద్యం దుకాణాల కోసం కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరెవరు ఏయే షాపులను దక్కించుకోవాలనే విషయంపై సోమవారం రాత్రి సీతమ్మధారలోని ఒక మద్యం వ్యాపారి గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ప్రధానంగా 8 మంది మద్యం సిండికేట్ల మధ్య ప్రాథమికంగా అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారి వివేక్ సాహు ఏకంగా 30 షాపులకు దరఖాస్తు చేశారు. నోయిడాకు చెందిన వ్యాపారులు 10 షాపుల వరకూ దరఖాస్తు చేస్తున్నట్టు సమాచారంతో స్థానిక సిండికేట్ కంగుతింది. ఆయా వ్యాపారులకు లాటరీలో షాపులు దక్కితే... వాటిని ఏ విధంగా చేజిక్కించుకోవాలనే అంశంపై తాజాగా సిండికేట్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.సిండికేట్ నేతృత్వంలో మార్పు.. కొత్త ఎమ్మెల్యే ప్రవేశంవిశాఖ మద్యం సిండికేట్ మొదటగా దరఖాస్తులు ఎక్కువ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం మద్యం వ్యాపారంలో ఉన్న ప్రధానమైన 8 మంది సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఈ సిండికేట్ మొన్నటివరకు ముందుండి నడిపించిన ఎమ్మెల్యే స్థానంలో.. కొత్త ఎమ్మెల్యే సారథ్యం వహించేలా ప్రణాళిక రచించారు. తద్వారా షాపులకు ఎక్కువ పోటీ రాకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణం నడుస్తున్న భవనాల వద్ద వ్యవహారం మొదలుపెట్టారు. ఆయా భవన యజమానులతో మాట్లాడుకుని.. అవి తమకే వచ్చేలా చూసుకున్నారు. ఇందుకోసం ఎకై ్సజ్ శాఖలోని కొద్ది మంది అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాలున్న భవనాన్ని ఫలానా మద్యం వ్యాపారులకే అద్దెకు ఇవ్వాలని కొద్ది మంది అధికారులు చర్చలు జరిపారు. అలా అయితేనే మీకు పాత అద్దెలను సక్రమంగా వచ్చేలా చూస్తామని.. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని కొద్ది మందిని బెదిరించినట్టు తెలుస్తోంది. కాగా.. లాటరీ పూర్తయిన తర్వాత వ్యాపారులు షాపులను 12నే తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రధానమైన ప్రాంతాలన్నింటిలో తమ షాపులే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ ఎవరైనా కొత్తవాళ్లకు షాపులు వస్తే.. భవనాలు దక్కకుండా, ప్రధానమైన ప్రాంతాల్లో వారు వ్యాపారం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడా నుంచి మద్యం వ్యాపారులు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.విశాఖలో తక్కువ దరఖాస్తులుఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో విశాఖ జిల్లా పరిధిలోని 155 షాపులకు గానూ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి 878 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు సగటున 6 దరఖాస్తులు కూడా రాలేదు. అనకాపల్లి జిల్లాలో 136 షాపులకుగానూ 1,076 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి జిల్లాలో 40 మద్యం షాపుల్లో 36 షాపులకు మాత్రమే దరఖాస్తులు రాగా... మరో 4 షాపులకు దరఖాస్తులు రాలేదు. 36 షాపులకు మొత్తం 330 దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా విశాఖలో మద్యం వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో షాపునకు కనీసం 40 నుంచి 50 మంది పోటీపడతారని ఊహించారు. ఇందుకు భిన్నంగా దరఖాస్తుల ప్రక్రియ ముగిసే సమయానికి సగటున 10 మందికి మించి పోటీపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడాల నుంచి పోటీ రావడంతో సిండికేట్ సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ఎలాగైనా వారికి షాపులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ లాటరీలో షాపులు వస్తే వాటిని ఎలా చేజిక్కించుకోవాలనే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
మద్యం వ్యాపారుల సిండికేట్..
సాక్షి, వికారాబాద్: మద్యం వ్యాపారుల్లో ఒకటే టెన్షన్.. మరికొన్ని గంటల్లో డ్రా పద్ధతిన వైన్ షాపులను కేటాయించనున్నారు. వీటికోసం దరఖాస్తు చేసుకున్న వారు అదృష్టం తమనే వరించాలని దేవుళ్లను మొక్కుకుంటున్నారు. బినామీల పేరిట టెండర్లు వేసిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం ఉత్కంఠగా ఉన్నారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు. లక్కీ డ్రా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగే వైన్‌షాపులు 10 నుంచి 20 వరకు ఉన్నాయి. ధారూరు, కుల్కచర్ల, పెద్దేముల్, దోమ, మన్నెగూడ, బషీరాబాద్, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాల్లోని మద్యం దుకాణాలకు ఎక్కువగా పోటీ ఉంది. వ్యాపారం బాగా జరిగే మద్యం దుకాణాలను ఎలాగైనా దక్కించుకోవాలని సిండికేట్ వ్యాపారులు పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం తాము ఎంపిక చేసుకున్న మద్యం దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు రాకుండా ఈ గ్రూపులోని సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా బలంవంతంగా దరఖాస్తు చేసేందుకు ముందుకు వచ్చినా ఓ ప్రజాప్రతినిధి ద్వారా అడ్డుకున్నట్లు వినికిడి. తాండూరు సర్కిల్లోని ఓ మద్యం దుకాణానికి గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలిసిన స్థానిక సిండికేట్ సభ్యులు.. లక్కీడ్రాలో గుంటూరు వ్యాపారికి షాపు దక్కినా తమకే వదిలేసేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. తాండూరు కు చెందిన ఓ రాజకీయ నాయకుడు, మహిళా నాయకురాలు మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు తెరవెనక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. లక్కీ డ్రాలో తమకు షాపులు దక్కకున్నా.. లాటరీ వచ్చిన వ్యాపారుల సిండికేట్! వారి నుంచి లైసెన్స్‌లు పొందేలా సిండికేట్ సభ్యులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎక్సైజ్ అధికారులు మాత్రం జిల్లాలో సిండికేట్ అనేది లేదని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రాలు తీసి దుకాణాలను కేటాయిస్తామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. షాపుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. ఏర్పాట్లు పూర్తి.. వికారాబాద్‌లో మొత్తం 46 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటికోసం మొత్తం 683 టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా తాండూరు సర్కిల్లోని 16 మద్యం దుకాణాలకు 206, వికారాబాద్ సర్కిల్లోని 11 షాపులకు 202 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. వికారాబాద్‌లోని అంబేడ్కర్ భవనంలో ఉదయం 11 గంటలకు కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ పర్యవేక్షణలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. -
లిక్కర్ వ్యాపారులకు బార్కోడ్ బాదుడు
నెలకు రూ. 5 వేల వసూలు సరిగా పనిచేయని సాఫ్ట్వేర్ ఐఎంఎల్ డిపో వద్ద పడిగాపులు వైన్‌షాపుల్లో కొనుగోలు చూపినా స్టాక్ బ్యాలెన్సు చూపని వైనం గుడివాడ: లిక్కర్ వ్యాపారులకు బార్ కోడ్ స్కానర్ విధానం తలనొప్పిగా మారింది. అది సరిగా పనిచేయక పోయినా నెలనెలా సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రం అద్దె పేరుతో నెలకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సరిగా లేకపోవడంతో ఐఎంఎల్ డిపో వద్ద సరుకు కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైటెక్ విధానం సాఫ్ట్వేర్ కంపెనీకి వరంగాను లిక్కర్ వ్యాపారులకు తలనొప్పిగాను మారింది. ఏడు నెలలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా పట్టించుకున్న నాథుడే లేడని లిక్కర్ వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బార్ కోడింగ్ బాదుడు ఇలా.. మద్యం అమ్మకాలు ఆన్లైన్ చేసేందుకు బార్‌కోడింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బార్కోడ్ స్కానర్, కంప్యూటర్ కోసం ఒక్కో షాపు యజమాని రూ. ఒక లక్షా రెండు వేలకు చెక్కులను గ్యారెంటీ రూపంలో అందించారు. దీని సాఫ్ట్వేర్ కాంట్రాక్టును సీటెల్ కంపెనీ తీసుకోగా వైన్‌షాపుల్లో కంప్యూటర్లు అమర్చి బార్కోడ్ స్కానర్లు ఇచ్చారు. నిర్వాహణను కార్వే కంపెనీ తీసుకుంది. ప్రతి షాపునకు కంప్యూటర్లు, బార్కోడ్ స్కానర్లు ఇచ్చారు. బార్కోడ్ స్కానింగ్ అయిన అనంతరమే మద్యం విక్రయించాల్సి ఉంది. లిక్కర్ డిపో వద్ద కూడా ఇదే తరహాలో బార్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తేనే సరుకు బయటకు ఇస్తారు. ఆన్ లైన్ సరిగా లేకపోవడంతోపాటు, బార్కోడ్ సాఫ్ట్వేర్ ఇబ్బందుల కారణంగా వారంలో రెండు, మూడు సార్లయినా లిక్కర్ గోదాము వద్ద సరుకు కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. డిపో వద్దకు సరుకు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రి వరకు వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. నెలకు రూ.4,999 బాదేస్తున్నారు జిల్లాలో ఉన్న 301 వైన్‌షాపులకు ఈ బార్కోడ్ స్కానర్లును అమర్చారు. ఇంకా 167 బార్లకు బార్కోడ్ స్కానర్లు ఇచ్చినా అవి అమర్చలేదు. ప్రస్తుతం అమర్చిన వైన్‌షాపుల నుంచి నెలకు బ్యాంకు అకౌంటు ద్వారా ఒక్కోషాపునకు రూ.4999 నేరుగా ఖాతా నుంచి తీసేసుకుంటున్నారు. స్కానర్లు కొన్ని బ్రాండ్లను ఆన్లైన్లో ఫీడ్ చేయకపోవడంతో ఐఎంఎల్ డిపో వద్ద స్కాన్ చేసినా తీసుకోవడం లేదని చెబుతున్నారు. వీటిలో ఎంసీ లగ్జరీ, ఓటి, ఆఫీసర్స్ చాయిస్ తదితర బ్రాండ్లను ఆన్లైన్లో స్కానింగ్ అంగీకరించ డం లేదు. కార్వే కంపెనీ ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో అమ్మకాలు వస్తున్నాయి కానీ ఆన్లైన్లో బ్యాలెన్సు షీటు రావడం లేదని చెబుతున్నారు. దీంతో ఒక్కో వైన్ షాపు యజమాని వద్ద ఆన్లైన్లో పెద్దఎత్తున స్టాక్ ఉన్నట్లు చూపిస్తోంది. పూర్తిస్థాయిలో సాఫ్ట్వేర్ పనిచేయకపోయినా తమ వద్ద ఇలా వసూలు చేయడంపై వైన్‌షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ను సరిచేయాలని కోరుతున్నారు. -
సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా
విజయనగరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఆయన వెంట సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యావ్యాపారం, సంచులు మోసేవారు తప్ప సంగతి తెలిసినవారు ఎవరూ లేరని వైఎస్ఆర్ సీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెబితే మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకే అధికారం దక్కేదన్నారు. చంద్రబాబు మారారని ప్రజలు అనుకున్నారని, అయితే గతంలో కన్నా దారుణంగా, మోసగానిలా మారారన్న విషయం వారికి అర్ధమైపోయిందని చెప్పారు. చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రం విడిపోవాలన్న ఆలోచన పుట్టుకొచ్చిందని రోజా అన్నారు. **