
గాంధీనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం గాంధీనగర్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తన కుటుంబసమేతంగా కలిసి వచ్చి నామినేషన్ వేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అమిత్ షా తన మనవరాలికి కాషాయరంగుతో ఉన్న టోపీ పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం దానిని పెట్టుకోవడానికి నిరాకరించింది. తన హ్యాట్ మాత్రమే పెట్టుకుంటానని అమిత్ షా పెట్టిన బీజేపీ టోపిని తీసేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా అమిత్ షా తొలిసారి లోక్‌సభ బరిలో నిలుస్తోన్న విషయం తెలిసింది. గాంధీనగర్ నుంచి ఆరుసార్లు విజయం సాధించిన అగ్రనేత ఎల్‌కే అద్వానీని పక్కన పెట్టి షాని బీజేపీ ఇక్కడ బరిలో నిలిపింది.
Comments
Please login to add a commentAdd a comment