హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు బాలికలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గాంధీనగర్కు చెందిన ఈ బాలికలు...ఇంట్లో తల్లిదండ్రులు మందలించటంతో వారు గోవా పారిపోయేందుకు సిద్ధపడినట్లు విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు. అనంతం వారిని పోలీసులకు అప్పగించారు.వారి వద్ద నగదు, ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి విచారణ జరుపుతున్నారు.