తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ | Narendra Modi takes mother's blessings before taking up PM's post | Sakshi
Sakshi News home page

తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ

Published Fri, May 16 2014 1:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Narendra Modi takes mother's blessings before taking up PM's post

గాంధీనగర్ : దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు.  పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (వారణాసి, వడోదర) భారీ విజయం సాధించిన తర్వాత ఆయన నేరుగా గాంధీనగర్‌లోని తన నివాసానికి వెళ్లారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కాసేపు ఆమెతో ముచ్చటించారు.

తన కొడుకు ప్రధాని కాబోతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భారీ విజయం తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన మోడీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. స్థానికులు బాణసంచా కాల్చి, డప్పువాయిద్యాలతో హోరెత్తించారు. దీంతో అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. తన కొడుకు తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని.. దేశానికి మోడీ ఎంతో సేవ చేయాలని ఆయన తల్లి ఆకాంక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement