Heeraben
-
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
-
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత
-
మోదీకి మాతృవియోగం
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. వందేళ్లు సంపూర్ణ జీవితం గడిపిన ఆమె అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. హీరాబెన్‌కు ప్రధాని మోదీ సహా అయిదుగురు కుమారులు సోమాబాయ్, అమృత్, ప్రహ్లాద్, పంకజ్, కుమార్తె వాసంతిబెన్ ఉన్నారు. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ప్రధాని మోదీ వెంటనే గాంధీనగర్‌కు బయల్దేరి వెళ్లారు. గాంధీనగర్ శివార్లలో రేసన్ గ్రామంలో నివాసం ఉంటున్న తన సోదరుడు పంకజ్ మోదీ నివాసంలో ఉంచిన తల్లి భౌతిక కాయాన్ని సందర్శించిన మోదీ ఆమెకు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. పాదాభివందనం చేశారు. అనంతరం ప్రధాని స్వయంగా ఆమె పాడె మోస్తూ వైకుంఠ రథం వరకు తీసుకువెళ్లారు. తల్లి భౌతికకాయంతో పాటు అదే వాహనంలో మోదీ బాధాతప్త హృదయుడై ప్రయాణించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గాంధీనగర్ శ్మశాన వాటికలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనకు వెళ్లినప్పుడల్లా తల్లితో కాసేపు గడిపేవారు. తన పుట్టిన రోజు నాడు వెళ్లి తల్లి ఆశీర్వాదం తీసుకునేవారు. దేశ ప్రధానమంత్రికే తల్లి అయినప్పటికీ హీరాబెన్ ఎంతో నిరాడంబరమైన జీవితం గడిపారు. అత్యంత విషాదం ప్రధాని తల్లి హీరాబెన్ మరణవార్త విన్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మోదీకి సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తల్లి వందేళ్ల పోరాటం భారతీయ ఆదర్శాలకు నిదర్శనంగా నిలుస్తుందని మాతృదేవోభవ స్ఫూర్తికి ప్రధాని కట్టుబడి ఉన్నారని, హీరాబెన్ ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే హీరాబా ఆత్మకు శాంతి చేకూరాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ట్వీట్ చేశారు. తల్లిని మించిన గురువు, దైవం, స్నేహితురాలు ఉండరని, ప్రపంచంలోని అతి పెద్ద దుఃఖం తల్లిని కోల్పోవడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తల్లిని కోల్పోవడం అత్యంత బాధాకరమైనదని, ఇలాంటి సంక్లిష్ట సమయాలను ఎదుర్కొనే ధైర్యం ఆ కుటుంబానికి ఉండాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హీరాబెన్ మృతి బాధాకరమని ప్రధాని కుటుంబానికి సంతాపం తెలియజేశారు. బీజేపీ నాయకుడు ఆడ్వాణీ ప్రధానికి తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిరాడంబరంగా గడిపిన ఆమె జీవితం ఎప్పటికీ మరువలేనిదన్నారు. ప్రపంచ నేతల సంతాపం ప్రపంచ దేశాల అధినేతలు కూడా ప్రధాని మోదీకి సంతాపం తెలియజేశారు. జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, నేపాల్ ప్రధాని ప్రచండ, పాకిస్తాన్ ప్రధానిమంత్రి షెబాజ్ షరీఫ్‌లు ట్విటర్ వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. తల్లి లేని లోటు పూడ్చలేనిదని ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తమ తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.‘‘తల్లిని కోల్పోవడం కంటే మించిన లోటు ప్రపంచంలో ఏదీ ఉండదు. భారత ప్రధాని మోదీకి సంతాపం తెలియజేస్తున్నాను’’ అని పాక్ ప్రధాని షరీఫ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తల్లీ.. నిను తలంచి...! తల్లి గురించి ప్రధాని మోదీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల గొప్ప ప్రయాణాన్ని పూర్తి చేసుకొని భగవంతుడి పాదాల చెంతకు చేరారు. ఆమెలో నాకు ఎప్పుడూ మూడు గొప్ప సుగుణాలు కనిపిస్తాయి. తపస్సులాంటి జీవితం, నిస్వార్థపర సేవా తత్వం, విలువలకు కట్టుబడి జీవితం. ఇలా ఆమెలో త్రిమూర్తులు కనిపిస్తారు. 100వ పుట్టిన రోజు నాడు అమ్మను కలిసినప్పుడు ఆమె నాతో ‘నీ బుద్ధి చెప్పినట్టుగా పని చేయి. పరిశుద్ధంగా జీవితాన్ని గడుపు’ అని చెప్పారు. ఆ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’’ అన్నారు. గత జూన్‌లో హీరా బెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆమె గురించి మోదీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ‘‘సాదాసీదా జీవితం గడిపినా ఆమె ఒక అసాధారణ మూర్తి. మేం ఆరుగురు పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు ఎంతో కష్టపడింది. పరిశుభ్రతకు ప్రాణమిచ్చేది. అదే సమయంలో సామాజిక బాధ్యతలనూ నెరవేర్చింది. పంచాయతీ నుంచి లోక్‌సభ దాకా ప్రతి ఎన్నికల్లోనూ విధిగా ఓటేసింది. గుజరాత్ సీఎం అయ్యాక తొలిసారిగా తన ఆశీర్వాదం కోసం వెళ్తే అవినీతికి పాల్పడొద్దని ఒకే సలహా ఇచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు. మొత్తం ఆరుగురు సంతానంలో మోదీ మూడోవారు. అగ్ర రాజ్య వేదికపైనా... 2015లో అమెరికాలో పర్యటించిన మోదీ సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తన తల్లి గొప్పదనాన్ని, ఆమె అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనైన తీరు ఆహూతులతోనూ కంటతడి పెట్టించింది. మీ జీవితంలో తల్లి పాత్ర ఏమిటన్న ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో ప్రదాని కన్నీళ్లపర్యంతమయ్యారు. ‘‘మమ్మల్ని పెంచేందుకు అమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో అంట్లు తోమడం, నీళ్లు పట్టడం వంటి ఎన్నో పనులు చేసింది’’ అంటూ ఆమె ఎదుర్కొన్న కష్టాలను, వాటిని అధిగమించడంలో కనబరిచిన మనో నిబ్బరాన్ని గద్గద స్వరంతో వివరించారు. ‘‘అమ్మకిప్పుడు 90 ఏళ్లు దాటినా అన్ని పనులూ తానే చేసుకుంటుంది. అక్షర జ్ఞానం లేకపోయినా టీవీలో వార్తలు చూసి ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ తెలుసుకుంటూ ఉంటుంది’’ అని చెప్పారు. తల్లి చితి వద్ద విషణ్ణ వదనంతో మోదీ PM Modi, Gujarat CM Bhupendra Patel and others participating in the cremation of Heeraben Modi. pic.twitter.com/FsuT3vzFBv — Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) December 30, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi — Narendra Modi (@narendramodi) December 30, 2022 -
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఓదార్పు
-
ఆశీర్వాదం.. అమ్మతో కలిసి భోజనం
గాంధీనగర్: దేశానికి రాజైనా.. తల్లికి మాత్రం బిడ్డే. ఈ సామెత ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో అక్షర సత్యం అనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఊపిరి సలపని బాధ్యతలతో బిజీగా ఉండే మోదీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తప్పకుండా తల్లి హీరాబెన్‌ను కలుస్తారు. అలానే నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి సమక్షంలో కాసేపు గడిపారు మోదీ. ప్రస్తుతం మోదీ తల్లి హీరాబెన్.. గాంధీనగర్‌కు సమీపంలోని రైసిన్ గ్రామంలో చిన్నకుమారుడైన పంకజ్ మోదీ దగ్గర ఉంటున్నారు. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా మోదీ మంగళవారం తల్లి దగ్గరకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకుని.. ఆమెతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అనంతరం తల్లితో, చుట్టుక్కల వారితో కాసేపు ముచ్చటించారు మోదీ. కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా హీరాబెన్ మోదీకి 501 రూపాయలను బహుమతిగా ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత మోదీ తొలుత తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రే గుజరాత్ చేరుకున్న మోదీ నేడు పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. నర్మదా నదిపై ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్‌ను, వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో కలిసి నమామి నర్మద మహోత్సవాన్ని ప్రారంభించారు. అలానే సర్దార్ సరోవర్ డ్యామ్‌కు సమీపంలోని బటర్‌ఫ్లై పార్క్‌ను కూడా సందర్శించారు మోదీ. ఈ క్రమంలో ఓ బ్యాగులో తీసుకువచ్చిన సీతాకోక చిలుకలను బయటకు వదిలి పెట్టారు మోదీ. -
చప్పట్లు కొడుతూ మోదీ తల్లి హర్షాతిరేకం..
సాక్షి, అహ్మదాబాద్ : కుమారుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ తన నివాసంలోనే టీవీలో వీక్షించారు. మోదీ సోదరుడు పంకజ్ కూడా తల్లితో కలిసి ఈ వేడుకను తిలకించారు. గాంధీనగర్ సమీపంలోని రాయ్సన్ గ్రామంలో ఆమె తన నివాసంలో టీవీలో చూస్తూ... కొడుకు ప్రధానిగా ప్రమాణం చేస్తుండగా చప్పట్లు కొట్టి మురిసిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఆదివారం నరేంద్ర మోదీ గుజరాత్ వెళ్లి తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తల్లికి పాదాభివందనం చేసి, కాసేపు ఆమెతో గడిపారు. -
ప్రపంచ శక్తిగా భారత్
అహ్మదాబాద్: భారత్ ప్రపంచశక్తుల్లో ఒకటిగా నిలిచేందుకు రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని జేపీ చౌక్ దగ్గర నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘భారత చరిత్రలో 1942–47 మధ్యకాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్‌ను ప్రపంచశక్తిగా నిలబెట్టేందుకు రాబోయే ఐదేళ్లు అంతే ముఖ్యమైనవి.’ అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అయినా, వినమ్రంగా ఉండాలని హితబోధ చేశారు. నన్ను వేళాకోళం చేశారు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ పండితులనే ఆశ్చర్యంలో ముంచెత్తాయని మోదీ అన్నారు. ‘ఆరో విడత ఎన్నికల చ్రారంలో భాగంగా ఎన్డీయేకు 300కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని నేను చెప్పగానే చాలామంది వేళాకోళం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీచేయడం లేదు.. ప్రజలే పోటీ చేస్తున్నారు అని నేను చెప్పాను. బీజేపీని మరోసారి అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు’ అని మోదీ వెల్లడించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సూరత్ అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు చనిపోవడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రథయాత్రలకూ ఇబ్బంది పడ్డారు: అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ, రాష్ట్రంలో గూండాయిజాన్ని, అవినీతిని అంతమొందించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ‘ప్రజలు నరేంద్ర భాయ్‌ను అమితంగా అభిమానించడానికి ఓ కారణం ఉంది. ఆయన చాలాగ్రామాల్లో పర్యటించారు. చాలామంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గుజరాత్‌ను బీజేపీకి కంచుకోటగా తీర్చిదిద్దారు’ అని షా ప్రశంసించారు. -
యోగా మానేసి అమ్మ వద్దకు ప్రధాని
గాంధీనగర్: సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రతిరోజు చేసే యోగాను నేటి ఉదయం మాత్రం స్కిప్ చేశానని మోదీ ట్వీట్ చేశారు. తన తల్లి హీరాబెన్‌ను కలుసుకునేందుకు వెళ్లానని, ఆమెతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశానని ట్వీట్లో పేర్కొన్నారు. తల్లితో కలిసి సమయాన్ని గడపడంపై ఆయన ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. గత డిసెంబర్లో చివరిసారిగా గుజరాత్‌లోని దీసాలో ర్యాలీ, పార్టీ సమావేశాల్లో పాల్గొన్న సందర్బంగా తల్లిని కలుసుకున్న విషయం తెలిసిందే. మోదీ తల్లి హీరాబెన్ ప్రస్తుతం గాంధీనగర్ శివారులో ఆయన సోదరుడు పంకజ్ మోదీ ఇంట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా తనకు వీలు చిక్కడంతో సోదరుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో పాటు తల్లి హీరాబెన్‌ను ఆప్యాయంగా పలకరించారు. తల్లితో కలిసి విలువైన సమయాన్ని గడిపానని మోదీ చెప్పారు. కాగా, నేటి నుంచి మూడు రోజులపాటు గాంధీనగర్‌లో జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సును మోదీ ప్రారంభించనున్నారు. ఈ భారీ సదస్సుకు దాదాపు 500 సంస్థల సీఈవోలు హాజరు అవుతారు. సోమవారం గాంధీనగర్ రైల్వేస్టేషన్లో రూ.250 కోట్లతో పునర్నిర్మాణ పనులకు మోదీ సోమవారం శంకుస్థాపన చేసిన మోదీ నేడు పలు కార్యక్రమాలకు హాజరై ప్రసంగించనున్నారు. Skipped Yoga & went to meet mother. Before dawn had breakfast with her. Was great spending time together. — Narendra Modi (@narendramodi) 10 January 2017 -
నోట్ల రద్దుతో వారిద్దరూ హాట్ టాపిక్ మారారు
-
అమ్మ తొలిసారి వచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి రాజైనా తల్లికి కొడుకే. ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు పనులన్నీ పక్కనబెట్టి తన తల్లి హీరాబెన్‌తో అప్యాయంగా గడిపారు. మోదీ స్వయంగా ఆమెను వీల్‌చైర్‌లో తీసుకెళ్లి గార్డెన్ చూపించారు. తల్లికి నీళ్లు అందించి సేవలు చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత హీరాబెన్ తొలిసారి ఢిల్లీ రేస్ కోర్సు రోడ్డులోని ఆయన అధికార నివాసం 7 బంగ్లాకు వచ్చారు. హీరాబెన్ కొన్ని రోజులు అక్కడ ఉండి గుజరాత్‌కు తిరిగి వెళ్లారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్న మోదీ తల్లితో అప్యాయంగా గడిపారు. మోదీ తన తల్లితో దిగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'నా అధికార నివాసానికి అమ్మ తొలిసారి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆమెతో విలువైన సమయం గడిపాను. అమ్మ గుజరాత్‌కు వెళ్లింది' అని మోదీ ట్వీట్ చేశారు. సోఫాలో కూర్చుని హీరాబెన్‌కు నీళ్ల గ్లాసు ఇస్తున్నపుడు, ఆమెను వీల్‌చైర్‌లో తీసుకెళ్తూ గార్డెన్లో మొక్కలు చూపిస్తున్నప్పటి ఫొటోలను మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మోదీ తల్లి గుజరాత్లో మెహ్సనా జిల్లాలోని సొంతూరు వాద్నగర్లో నివసిస్తున్నారు. -
తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ
గాంధీనగర్ : దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (వారణాసి, వడోదర) భారీ విజయం సాధించిన తర్వాత ఆయన నేరుగా గాంధీనగర్‌లోని తన నివాసానికి వెళ్లారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కాసేపు ఆమెతో ముచ్చటించారు. తన కొడుకు ప్రధాని కాబోతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భారీ విజయం తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన మోడీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. స్థానికులు బాణసంచా కాల్చి, డప్పువాయిద్యాలతో హోరెత్తించారు. దీంతో అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. తన కొడుకు తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని.. దేశానికి మోడీ ఎంతో సేవ చేయాలని ఆయన తల్లి ఆకాంక్షించారు.