వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట మండలం రామన్నపేట స్టేజీ సమీపంలో ద్విచక్రవాహనం పైనుంచి పడి ఒక్కరు దుర్మరణం చెందగా.. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో బైక్ ఢీకొని మరొకరు చనిపోయారు.
సూర్యాపేట రూరల్, న్యూస్‌లైన్: ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని రామన్నగూడెం స్టేజీ వద్ద శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన మర్రిపెల్లి అంతయ్య సొంత పనినిమిత్తం యర్కారం గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రామన్నగూడెం స్టేజీ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అంతయ్యను స్థానికులు గమనించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ద్విచక్రవాహనం ఢీకొని...
యాద్గార్‌పల్లి(మిర్యాలగూడ క్రైం): మండలంలోని యాద్గార్‌పల్లిలో తడకమళ్ల రహదారిపై ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తడకమళ్లకు చెందిన పంగ చంద్రయ్య(50 ) అంతిరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టరుపై డ్రైవరుగా పని చేస్తున్నాడు. యాద్గార్‌పల్లిలో పనులు ముగిసిన అనంతరం ట్రాక్టరును అక్కడే ఉంచి స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్నాడు. ఇదే సమయంలో యద్గార్‌పల్లికి చెందిన మహేష్ ద్విచక్రవాహనంపై వస్తూ ప్రమాదవశాత్తు చంద్రయ్యను ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
Published Mon, Nov 4 2013 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement