
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: సుష్మ
న్యూఢిల్లీ : బీజేపీ భారీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సుష్మా స్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. విదీశ నుంచి బరిలోకి దిగిన ఆమె భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గెలుపు అనంతరం సుష్మ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వంలో తన పాత్ర ఏంటో ప్రధానమంత్రి, పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు.
ఇక గాంధీనగర్లో 3 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన ఎల్కే అద్వానీ బీజేపీ సాధించిన భారీ విజయంతో ఖుషీగా ఉన్నారు. కాంగ్రెస్ అవినీతి, ధరల పెరుగుదలాంటి అంశాలు ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపించాయన్న ఆయన తమ పార్టీ భారీ విజయానికి ఇదే కారణమన్నారు.