Infant murder
-
చిన్నారిని చిదిమేశారు.. నీటి సంపులో పడేసి రెండు నెలల పసికందు హత్య
సాక్షి, హైదరాబాద్: అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారిని తల్లి పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లి నీటి సంపులో పడేసి హత్య చేశారు. ఎస్ఐ రమేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామంతాపూర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సనాబేగానికి భర్త, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. అత్తమామలు అబ్దుల్ బాబు, ఖుమర్ బేగంతో పాటు ఆడపడుచు, మరుదులు వారి సంతానం మొత్తం దాదాపుగా పది మందితో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 19న రాత్రి ఆమె భర్త ఉద్యోగ రీత్యా బయటికి వెళ్లడంతో సనాబేగం తన రెండు నెలల కుమారుడు అబ్ధుల్ రహమాన్.. అత్త, ఆడపడచూ ఫౌజియా బేగం, అడపడుచు కుమార్తెతో కలిసి ఒకే గదిలో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన కుమారుడు కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన సనాబేగం చిన్నారి కోసం ఇంటి పరిసరాల్లో గాలించింది. ఎక్కడా ఆచూకీ దొరకŠక్ పోవడంతో అనుమానంతో నీటి సంపులో వెతకగా అందులో కనిపించాడు. దీంతో బాలుడిని వెలికి తీసి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తల్లి సనాబేగం కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్ట్ -
కన్న తండ్రి చేతిలో తొమ్మిది రోజుల శిశువు హత్య
పావగడ (కర్ణాటక) : కన్నతండ్రే యముడయ్యాడు.. కుటుంబ గొడవల నేపథ్యంలో తొమ్మిది రోజుల వయసున్న చిన్నారిని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన అరసికెర పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవలకెర గ్రామంలో గురువారం వెలుగు చూసింది. అనసికెర ఎస్ఐ క్రిష్ణమూర్తి తెలిపిన మేరకు.. దేవలకెర గ్రామానికి చెందిన ఈరణ్ణ.. గిడ్డయ్యన రొప్ప గ్రామానికి చెందిన ప్రేమను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న తుమకూరు ఆస్పత్రిలో ప్రేమ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 25న ఆస్పత్రి నుంచి శిశువుతో పాటు ఇంటికి చేరుకుంది. అప్పటి దాకా ఈరణ్ణ పాపను అపురూపంగా చూసుకున్నాడు. ఈరణ్ణ తల్లికి ఈ వివాహం నచ్చక పోవడంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఈరణ్న తల్లిదండ్రులు 26న పాపను చూడటానికి వస్తున్నారని తెలిసి వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఈరణ్ణ పసికందు కడుపుపై గట్టిగా నులిమాడు. భార్య అడ్డుకుని గొడవ పడటంతో పరారయ్యూడు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన ప్రేమ.. శిశువును ఎత్తుకుని తన పెదనాన్న ఇంటికి వెళ్లింది. బుధవారం భార్య ఉన్న ఇంటికి వెళ్లిన ఈరణ్ణ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాప గొంతు నులిమి చంపేసి వెళ్లిపోయూడు. తన భర్తే కూతురిని చంపాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం అతన్ని అరెస్ట్ చేశారు. -
అతి కిరాతకం!
హైదరాబాద్: ఎల్బినగర్ చింతలకుంట పరిధిలో ఓ దారుణం జరిగింది. నెల రోజుల బాబును సవతి తల్లి, తండ్రి కలిసి అతికిరాతకంగా చంపారని బాబు తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజు అనే వ్యక్తికి సరితతో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరు కొంతకాలంగా మధురానగర్లో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక నెల క్రితం బాబు పుట్టాడు. అయితే రాజుకు గతంలో జయమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. రాజుకు, జయమ్మకు మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు. ఈ మధ్యకాలంలో జయమ్మ తన పిల్లలతో కలసి రాజు, సరిత ఉంటున్న ఇంటికి వచ్చేసింది. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సరిత గత రాత్రి ఇంటికి వచ్చింది. తెల్లవారేసరికి బాబు చనిపోయి ఉన్నాడు. తన భర్త, సవతి కలిసి బాబును హత్య చేసినట్లు సరిత ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. **