రోడ్డు ప్రమాదంలో అనంత జాయింట్ కలెక్టర్ మృతి | anantapur district additional joint collector jayachandra killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అనంత జాయింట్ కలెక్టర్ మృతి

Published Tue, Dec 17 2013 8:39 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

anantapur district additional joint collector jayachandra killed in road accident

అనంతపురం జిల్లాలో గత అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్ర ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు నుంచి అనంతపురానికి వస్తుండగా ఓడియంపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న బొలేరో వాహనం డివైడర్‌ను ఢీకొట్ట్టింది. ఈ ప్రమాదంలో జయచంద్ర కుమారుడు, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు.

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్ర మృతదేహన్ని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్చురిలో ఉన్న జయచంద్ర మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు సందర్శించి తమ సంతాపాన్ని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement