Additional joint collector
-
జిల్లాల సమగ్ర స్వరూపం
. -
మహిళే జగతికి వెలుగు
అనంతపురం కల్చరల్: ‘మహిళ ఒక శక్తి స్వరూపిణి. ఆమె అనుకుంటే సాధించలేనిదేదీ లేదు. మహిళతోనే జగతికి వెలుగు వస్తుంద’ని వక్తలు అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) ఖాజా మొహిద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ స్వరూప, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోందన్నారు. మహిళలలో మరింత చైతన్యం రావాలన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, మహిళా అక్షరాస్యత పెరగాలని ఆకాంక్షించారు. మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లను 33 నుంచి 50 శాతానికి పెంచాల్సిన అవసరముందన్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్నారు. ఏ రంగంలో చూసినా మహిళలు పురుషులకు తీసిపోరన్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని ప్రశంసించారు. మహిళల ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. దేశంలో 65 శాతం, రాష్ట్రంలో 59 శాతం మాత్రమే మహిళా అక్షరాస్యత ఉందని తెలిపారు. మహిళలు వంద శాతం అక్షరాస్యులుగా మారినప్పుడే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ప్రాం తాలలో మహిళలు ఆత్మగౌరవం చంపుకుని బహిర్భూమికి వెళుతుండడం మనమంతా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. కావున ప్రతిఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలకు ఎటువంటి ఛీత్కారాలు, అగౌరవం లేకుండా ప్రవర్తించాలని ఉద్యోగులకు సూచించారు. ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం తాము ముందుంటామన్నారు. మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి డీఎస్పీలను నియమించామని, ఎటువంటి సమస్యలొచ్చినా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతుండడం విచారకరమన్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ అభివృద్ధికి మూలం విద్య అని, అందరూ చదువుకోవాలని సూచించారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా నేపాల్‌లో మాత్రమే అత్యధికంగా మహిళా ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మన దేశంలో 27 శాతం మాత్రమే ఉండడం విచారకరమన్నారు. మహిళా సాధికారత, స్వావలంబన ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతున్నారన్నారు. అనంతరం వివిధ రంగాలలో కృషి చేసిన సామాజిక కార్యకర్తలకు జ్ఞాపికలందించారు. కాంతమ్మ, డాక్టర్ ప్రసూన, పుష్పవతి, డాక్టర్ షంషాద్‌బేగం తదితరులు జ్ఞాపికలు అందుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ విజయకృష్ణన్, సిరికల్చర్ జేడీ అరుణకుమారి, లీగల్ సెక్రటరీ సుబ్బారావు, డీఎంహెచ్‌వో ప్రభుదాస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగవేణి, ఐసీడీఎస్ ఏపీడీ సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
త్వరగా పంపండి..
* నియామకాలన్నా ఆపండి.. * ఇరు రాష్ట్రాల సీఎంలకు ఏజేసీ ఎస్.ఎస్.రాజు లేఖ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూ పడం లేదు. వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి వెళ్లాలని యోచిస్తున్నారు. ఇందుకు నిదర్శనం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎస్.రాజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడులకు ఓ లేఖ రాయడమే. తెలంగాణలో పనిచేస్తున్న తమను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని, లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న నియామకాలనైనా ఉద్యోగుల పంపకాలు జరిగే వరకు నిలిపివేయాలని ఈ లేఖలో కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో పాటు, రెవెన్యూ శాఖల మంత్రులకు కూడా ఈ లేఖలను పంపారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లాస్థాయి అధికారులు సుమారు 40 మంది వరకు ఉంటారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 50 రోజులు దాటింది. ఈ ఉద్యోగుల పంపకాల విషయం ఎటూ తేలకపోవడంతో ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ పంపకాలకు సంబంధించి సర్కారు నుంచి ఎప్పుడెప్పుడు ఉత్తర్వులు వస్తాయోనని వేచి చూస్తున్నారు. మరోవైపు సీమాంధ్ర అధికారులు వెళ్లిపోతే ఆ ఖాళీల్లో తమకు ఉన్నత ఉద్యోగావకాశాలు అందుతాయని మన రాష్ట్రానికి చెందిన అధికారులు ఆశాభావంతో ఉన్నారు. వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులను ఆ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ఇరు ప్రాంతాల అధికారుల మనోభావాలు దెబ్బతినకముందే ప్రభుత్వాలు స్పందించాలని అంటున్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసి ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులను అక్కడికి పంపాలని కోరుతున్నాను. అయితే.. ఉద్యోగుల పంపకాల కోసం నియమించిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఇంకా రాకపోవడంతో ఉద్యోగుల పంపిణీ విషయంలో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాప్యంతో ఏపీలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ భర్తీ అవుతున్నాయని ఆ ప్రాంతానికి చెందిన అధికారులు వాపోతున్నారు. ఈ పంపకాల విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవచూపాలని వారు పేర్కొంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో అనంత జాయింట్ కలెక్టర్ మృతి
అనంతపురం జిల్లాలో గత అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్ర ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు నుంచి అనంతపురానికి వస్తుండగా ఓడియంపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న బొలేరో వాహనం డివైడర్‌ను ఢీకొట్ట్టింది. ఈ ప్రమాదంలో జయచంద్ర కుమారుడు, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్ర మృతదేహన్ని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్చురిలో ఉన్న జయచంద్ర మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు సందర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. -
అనంతపురం జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం
-
ఇంజినీర్లూ..ఇదేం పని
సాక్షి ప్రతినిధి, కడప: స్వార్థ చింతన విడనాడి, ప్రజలు, ప్రాంతం యోగక్షేమాలే పరమావధిగా నాటి తరం నేతలు త్యాగాలకు ఒడిగట్టారు. ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజించారు. అలాంటి వారి వారసులుగా చెప్పుకుంటున్న నేటితరం నేతలు అడుగడుగునా స్వలాభాపేక్షే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. అందుకు గెజిటెడ్ అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ముందు వరసలో నిలుస్తున్నారు.అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మత్యాగం చేయడంతోనే ఆంధ్రప్రదేశ్‌కు తొలిమెట్టు పడింది. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు ఆయన. అందుకే తరాలు మారినా తెలుగుజాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. అటువంటి మహనీయుల వారసులైన తెలుగువారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యమించారు. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, జీతాల కంటే జీవితమే ముఖ్యమని సమ్మెలోకి వెళ్లారు. ప్రజల కోసం ప్రాంతం కోసం వారు ఆరాటపడుతున్న తీరుకు అన్ని పక్షాల నుంచి మద్దతు లభించింది. అందులో భాగంగా గెజిటెడ్ అఫీసర్లు సెప్టెంబర్ 20 నుంచి సమ్మెబాట పట్టారు. అటెండర్ నుంచి అడిషనల్ జాయింట్ కలెక్టర్ వరకూ, వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి సూపరింటెండెంటు ఇంజనీరు వరకూ సమ్మెలోకి వెళ్లారు. జీతాలు వదులుకొని సమ్మె చేస్తున్నారని ప్రజలు వీరికి పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. అయితే సుదీర్ఘకాలం సమ్మెచేసిన ఉద్యోగులు సమస్య కొలిక్కి రాకమునుపే ఉద్యమజెండాను పక్కనబెట్టేశారు. ప్రజాప్రతినిధులతో పోటీ పడుతున్న ఇంజినీర్లు రాష్ట్ర విభజన ప్రకటన వెలువడగానే రాయలసీమ, కోస్తాంధ్రలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వారికి సంఘీభావంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఊరికో మాట, పూటకో స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారు. అధిష్టానం ఆదేశాలు శిరసావహిస్తామంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పదే పదే పేర్కొన్నారు. తత్ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంది. ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఎవ్వరికి వారు పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే తప్పా వారి ప్రోటోకాల్ ఎవ్వరూ వదులుకోలేదు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఇటీవల తరచూ పర్యటన చేస్తూ అభివృద్ధి పనుల్లో మామూళ్ల కోసం అధికారులను వేధిస్తున్నట్లు సమాచారం. మరో ఎమ్మెల్యే అసైన్మెంటు కమిటీ సమావేశం నిర్వహించాలని, త్వరగా ప్రభుత్వ భూములు తన అనుచరులకు అప్పనంగా కట్టబెట్టాలని తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఇంజినీరింగ్ అధికారులు గమనించినట్లు ఉన్నారు. సెప్టెంబర్ 20నుంచి అక్టోబర్18వరకూ సమ్మెలో ఉన్నారు. ప్రత్యక్షంగా ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ వారు సమ్మె చేయలేదంటూ జీతాలు పొందేందుకు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఈ కోవలో ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయాలకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు. సమ్మె చేసిన కాలంలో ఇంజినీర్లు విధుల్లో ఉన్నారని డ్రాయింగ్ ఆఫీసర్లతో తప్పుడు రికార్డులు సృష్టించి జీతాలు పొందుతుండటం గమనార్హం. నాలుగో తరగతి ఉద్యోగులే నయం గెజిటెడ్ హోదా ఉన్న ఇంజినీర్ల కంటే నాలుగో తరగతి ఉద్యోగులే చిత్తశుద్ధితో సమైక్యరాష్ట్రం కోసం పోరాటం చేశారని పలువురు సమైక్యవాదులు పేర్కొంటున్నారు. నెలవారి జీతాలతోనే సంసారాలు నెట్టుకొచ్చే క్రింది స్థాయి ఉద్యోగులు ఉద్యమస్ఫూర్తికి భంగం కల్గకుండా వ్యవహరించారు. చాటుమాటుగా జీతాలు పొందేందుకు అడ్డదారులు ఎంచుకోవడం లేదని పలువురు అభినందిస్తున్నారు. జిల్లా వ్యావ్తంగా సుమారు 26వేల మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. అందులో అసిస్టెంట్ ఇంజనీర్ల నుంచి ఎస్ఈ స్థాయి వరకూ ప్రభుత్వ ఉత్తర్వులు 1013జీఓ ప్రకారం జీతాలు ఇవ్వాలంటూ పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీర్లు సమ్మెలోకి వెళ్లినా డ్రాయింగ్ ఆఫీసర్లు గుడ్డిగా సమర్థించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.