కిడ్నాప్‌ కథ సుఖాంతం | Kidnapping story ends happy | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కథ సుఖాంతం

Published Tue, Jan 31 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

Kidnapping story ends happy

= 24 గంటల్లో బాలుడి ఆచూకీ లభ్యం 
= కిడ్నాపర్‌ను పట్టించిన సీసీ కెమెరాలు 
= తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత 
 
అనంతపురం సెంట్రల్‌ : సర్వజనాస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. కిడ్నాపర్‌ చెర నుంచి బాలుడిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబు సోమవారం మీడియాకు వెల్లడించారు. నగరంలో గుత్తిరోడ్డుకు చెందిన ఆటోడ్రైవర్‌ రామాంజనేయులు తన కుమారుడు జయచంద్ర (6) కనిపించడం లేదని ఆదివారం టూటౌ¯ŒS పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సర్వజనాసుపత్రిలో చికిత్స కోసం వచ్చామని అందులో పేర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన టూటౌ¯ŒS సీఐ యల్లమరాజు, ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకొని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. బాలున్ని ఓ మహిâýæ ఆటోలో బస్టాండుకు తీసుకెళ్లినట్లు వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీని ఆధారంగా ఆరా తీస్తే నిందితురాలి వివరాలు లభ్యమయ్యాయి. కిడ్నాప్‌కు పాల్పడిన మహిâýæ ముర్తూజగా గుర్తించారు. ఈమెది కనగానపల్లి మండలం తూమచర్ల గ్రామం అయితే అనంతపురం రూరల్‌ మండలం కొడిమి వద్ద కొట్టాలలో నివాసముంటున్నట్లు విచారణలో తేలింది. ఆమె బంధువులను అదుపులోకి తీసుకొని ఫో¯ŒSకాల్స్‌ ట్రాప్‌ చేయగా బెంగుళూరులో ఉన్నట్లు సిగ్నల్‌ ఆధారంగా గుర్తించారు.

వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సదరు మహిళను బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించడం వలన కలిగే ఉపయోగాలు మరోసారి నిరూపితమైందన్నారు. నగరంలో 250పైచిలుకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, సర్వజనాసుపత్రిలోనే 50 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. దీని వలనే బాలున్ని 24 గంటల్లో పట్టుకోవడానికి ఆస్కారమైందని వివరించారు. కిడ్నాప్‌ కేసును చేధించడంలో సఫలీకృతులైన టూటౌ¯ŒS సీఐ యల్లమరాజు, ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ మాల్యాద్రి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.  
 
 ఇదిలా ఉండగా.. తిరుమలలో కిడ్నాప్‌కు గురైన బాలుడు తూమచర్లకు చెందడం.. అనంతపురంలో బాలుడిని కిడ్నాప్‌ చేసి బెంగళూరులో పట్టుబడిన మహిళ ముర్తూజ స్వస్థలం తూమచర్లే కావడంతో.. ఈ రెండింటికీ ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement