
తమిళసినిమా: చిత్ర పరిశ్రమ నిర్మాత తండ్రి లాంటి వాడు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హీరోల చూట్టూ సినిమా తిరుగుతోందని చెప్పవచ్చు. నిర్మాతలు డబ్బును పెట్టే ఒక యంత్రంగా మారిపోయాడనే అనాలి. అయితే ఇందుకు వ్యతిరేకంగా పాత రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఒక మహిళా నిర్మాత వచ్చారు. ఆమె షూటింగ్ స్పాట్‌కు వస్తే యూనిట్ గడ గడలాడాల్సిందే. ఆమె ఎవరో కాదు తొడ్రా చిత్ర నిర్మాత ఎస్.జయ్‌చంద్ర. నిర్మాతగా ఈమెకిది తొలి చిత్రం. జేఎస్.అపూర్వ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మధురాజ్ దర్శకుడు. నటుడు పాండ్యరాజన్ కొడుకు పృథ్వీరాజన్ హీరోగా నటించిన ఇందులో వీణ అనే నటి నాయకిగా నటించింది. ఎంఎస్.కుమరన్ ప్రతినాయకుడిగా నటించిన ఇందులో ఏ.వెంకటేశ్, కూల్ సురేశ్, టీ పొట్టి గణేశన్ ముఖ్య పాత్రలను పోషించారు. ఆర్‌ఎన్.ఉత్తమరాజ్ సంగీతాన్ని అందించిన తొడ్రా చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత జయ్‌చంద్ర మాట్లాడుతూ నిర్మాతగా తనకిది తొలి చిత్రం అని తెలిపారు. తన భర్త ఎంఎస్.కుమరన్‌కు నటనపై చాలా ఆసక్తి అని చెప్పింది. తనకు అసలు నచ్చదన్నారు. అలాంటిది తన అత్త చనిపోయే ముందు కొడుకు కోరిక నెరవేర్చమని చెప్పిందన్నారు. దీంతో అంతకు ముందు పరిచయం ఉన్న మ«ధురాజ్‌తో మంచి కథ రెడీ చెయ్యమని చెప్పానన్నారు. అలా మొదలైన చిత్రం ఈ తొడ్రా అని చెప్పారు. తనకు ఊరిలో నాలుగు టెక్స్‌టైల్ షాపులు ఉన్నాయని చెప్పారు. సినిమా కొత్త కావడంతో ఎలా వస్తుందో, ఏమోనన్న భయం ఉండేదన్నారు.
అయితే షూటింగ్ దశలో డబ్బు లక్షలు లక్షలు ఖర్చు అయిపోతుండడంతో పెట్టింది తిరిగి వస్తుందో రాదో అన్న ఆందోళన ఉండేదన్నారు. చిత్రం చూసిన తరువాత సంతృప్తి కలిగిందని చెప్పారు. అంతకు ముందు సెట్‌లో అందరినీ కోపంతో తిట్టేసేదాన్నని, ఇప్పుడు అది తలచుకుంటే పాపం అనిపిస్తుందని అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. క్లాప్‌బోర్డు సత్యమూర్తి సహకారంతో తామే చిత్రాన్ని సొంతంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత జయ్‌చంద్ర తెలిపారు. తొడ్రా చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment