
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కల్గించడంతో కొద్దిసేపు నిలిచిపోయింది. అయితే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ పునః ప్రారంభమైంది. ఆటగాళ్లు, అంపైర్లు మైదానంలోకి చేరుకోవడంతో అభిమానులు మళ్లీ మ్యాచ్‌ను వీక్షించేందుకు సిద్ధమయ్యారు. మ్యాచ్‌ను మొత్తంగా వీక్షించాలనుకుంటున్న అభిమానులు ఇక వర్షం కురువకుండా ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ స్కోరు 46.4 ఓవర్లలో 305/4 వద్ద ఉండగా వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా, వెంటనే తగ్గిపోవడంతో పిచ్‌ను సిద్ధం చేయడానికి గ్రౌండ్‌మెన్‌కు ఎంతో సమయం పట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment