ఐదేళ్ల బాలుడిపై రేప్ కేసు! | Five-year-old boy investigated for rape in Manchester | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బాలుడిపై రేప్ కేసు!

Published Mon, Mar 14 2016 3:23 PM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

ఐదేళ్ల బాలుడిపై రేప్ కేసు! - Sakshi

ఐదేళ్ల బాలుడిపై రేప్ కేసు!

మాంచెస్టర్(ఇంగ్లండ్): ఐదేళ్ల బాలుడిపై వచ్చిన అత్యాచార ఆరోపణలపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పదేళ్లలోపు చిన్నారులపై అత్యాచార కేసులు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది కాలంలో 21 రేప్ కేసులతో సహా 70 లైంగిక వేధింపుల కేసులు పోలీసులు నమోదు చేశారు. ఇక్కడి చట్టాల ప్రకారం పదేళ్లలోపు చిన్నారులను ప్రాసిక్యూట్ చేసే వీలు లేదు.

ఇంగ్లండ్, వేల్స్ లో చిన్నారులపై వివిధ నేరాల కింద 4,584 కేసులు నమోదయ్యాయని 'డైలీ స్టార్' వెల్లడించింది. తీవ్రంగా గాయపరిచాడనే ఆరోపణలతో రెండున్నరేళ్ల చిన్నారిపై కూడా కేసు నమోదు కావడం గమనార్హం. చిన్నారుల ఆగడాలు పెరిగిపోతుండడంతో పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య అధికమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement