మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టో తృటిలో సెంచరీ కోల్పోయాడు. 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసిన బెయిర్ స్టో రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆది నుంచి సమయోచితంగా ఆడిన బెయిర్ స్టో.. నైబ్ వేసిన 30 ఓవర్ ఐదో బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో బెయిర్ స్టో భారంగా పెవిలియన్ వీడాడు. బెయిర్ స్టో కొద్దిలో సెంచరీ కోల్పోవడంపై ఇంగ్లండ్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను జేమ్స్ విన్సే-బెయిర్ స్టోలు ఆరంభించారు. కాగా, జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా విన్సే(26) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత బెయిర్ స్టోతో జో రూట్ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్ స్టో ఔటయ్యాడు. ఆ తర్వాత జోరూట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 33 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment