Mystery Behind Coins Making An Appearance Across Manchestar In Telugu - Sakshi
Sakshi News home page

Mystery Coins Appearance In Manchester: ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..

Published Sun, Jul 16 2023 9:37 AM | Last Updated on Sun, Jul 16 2023 11:20 AM

Mystery Coins Making An Appearance Across Manchester - Sakshi

ఇంగ్లండ్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మాంచెస్టర్‌లో ఇటీవల కొద్దిరోజులుగా నాణేల కలకలం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని వీథుల్లోను, బస్టాపులు, పార్కుల్లోని బెంచీల మీద, పార్కింగ్‌ టికెట్‌ మెషిన్లు, వెండింగ్‌ మెషిన్లు, ఫుడ్‌ కోర్టులు సహా జన సమ్మర్దం గల ప్రదేశాల్లో కొద్దిరోజులుగా మిలమిలలాడే సరికొత్త నాణేలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి చెల్లా చెదురుగా పడి ఉంటున్నాయి.

జనాల్లో కొందరు వీటిని జేబులో వేసుకుని తీసుకుపోతుంటే, ఇంకొందరు మనకెందులే అన్నట్లుగా ఎక్కడివక్కడే వదిలేసి ముందుకు సాగిపోతున్నారు. ఈ నాణేలు వీథుల్లో ఎక్కడపడితే అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయో, వాటిని ఎవరు పడేశారో, దీని వెనుక గల ఉద్దేశమేమిటో జనాలకు కొద్దిరోజుల వరకు అంతుచిక్కలేదు. అయితే, దీనివెనుక గల కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న మాంచెస్టర్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ కోసం చేపట్టిన ‘ది ఫైండ్‌’ అనే ఆర్ట్‌ ప్రాజెక్టులో భాగంగా మార్క్‌ గాండెర్‌ అనే కళాకారుడు ఈ నాణేలను రూపొందించాడు.

మాంచెస్టర్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ జూలై 16 నాటితో ముగుస్తోంది. ఫెస్టివల్‌ చివరి రోజు వరకు నగరంలోని వేర్వేరు చోట్ల ఇలా రెండు లక్షల నాణేలను ఉంచనున్నట్లు ఆర్ట్‌ ప్రాజెక్ట్‌ నిర్వాహకులు తెలిపారు. అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని కనుక్కోగలమనే దాన్ని ఈ నాణేలు గుర్తు చేస్తాయని, ఇవి నగరవాసులకు, సందర్శకులకు జ్ఞాపికలుగా మిగిలిపోతాయని మార్క్‌ గాండెర్‌ వెల్లడించారు.

(చదవండి: భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక ఉండొచ్చట!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement