International Festival
-
నలుమూలల సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే "పండుగ"!
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాట్లండ్ రాజధాని ఎడన్బరా నగరంలో ఏటా ఆగస్టులో జరిగే ఎడిన్‌బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలుస్తోంది. ఆగస్టు మొదటివారం నుంచి చివరి వారం వరకు మూడువారాలకు పైగా జరిగే ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 5న మొదలైన ఈ వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి. యూరోపియన్, అమెరికన్, ఆఫ్రికన్, ఆసియన్ సంస్కృతులకు చెందిన ఎందరో కళాకారులు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలపై తమ కళాప్రదర్శనలు చేస్తారు. భారతీయ కళాకారులు కూడా ఈ వేదికలపై శాస్త్రీయ, జానపద సంగీత నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నేపథ్యం ఎడిన్‌బరాలో ఈ వేడుకలు దాదాపు డెబ్బయి ఐదేళ్లుగా జరుగుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు రుడాల్ఫ్ బింగ్ అనే నాజీ కాందిశీకుడు ఎడిన్‌బరా చేరుకున్నాడు. కొంతకాలానికి అతడు ఎడిన్బరాలోని గ్లైండెబోర్న్ నాటక సంస్థకు జనరల్ మేనేజర్‌గా ఎదిగాడు. ప్రపంచం నలుమూలలకు చెందిన సంస్కృతులన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి కళా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో బింగ్ తన మిత్రుడు హెన్రీ హార్వే వుడ్‌తో కలసి ఎడిన్‌బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ వేడుకలను ప్రారంభించాడు. ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి దేశ దేశాలకు చెందిన కళాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి ప్రదర్శనల ద్వారా తేలికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని వారు భావిస్తుంటారు. ఈ వేడుకల సందర్భంగా ఎడిన్‌బరా వీథుల్లో భారీ ఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తారు. ఊరేగింపులో పలువురు తమ కళానైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంటారు. సాయంత్రం వేళల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనలు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈసారి జరుగుతున్న వేడుకల్లో ఎడిన్‌బరా నగరం ఎటుచూసినా కోలాహలంగా పండుగ కళతో కనిపిస్తోంది. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు") -
ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..
ఇంగ్లండ్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మాంచెస్టర్‌లో ఇటీవల కొద్దిరోజులుగా నాణేల కలకలం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని వీథుల్లోను, బస్టాపులు, పార్కుల్లోని బెంచీల మీద, పార్కింగ్ టికెట్ మెషిన్లు, వెండింగ్ మెషిన్లు, ఫుడ్ కోర్టులు సహా జన సమ్మర్దం గల ప్రదేశాల్లో కొద్దిరోజులుగా మిలమిలలాడే సరికొత్త నాణేలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి చెల్లా చెదురుగా పడి ఉంటున్నాయి. జనాల్లో కొందరు వీటిని జేబులో వేసుకుని తీసుకుపోతుంటే, ఇంకొందరు మనకెందులే అన్నట్లుగా ఎక్కడివక్కడే వదిలేసి ముందుకు సాగిపోతున్నారు. ఈ నాణేలు వీథుల్లో ఎక్కడపడితే అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయో, వాటిని ఎవరు పడేశారో, దీని వెనుక గల ఉద్దేశమేమిటో జనాలకు కొద్దిరోజుల వరకు అంతుచిక్కలేదు. అయితే, దీనివెనుక గల కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం చేపట్టిన ‘ది ఫైండ్’ అనే ఆర్ట్ ప్రాజెక్టులో భాగంగా మార్క్ గాండెర్ అనే కళాకారుడు ఈ నాణేలను రూపొందించాడు. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జూలై 16 నాటితో ముగుస్తోంది. ఫెస్టివల్ చివరి రోజు వరకు నగరంలోని వేర్వేరు చోట్ల ఇలా రెండు లక్షల నాణేలను ఉంచనున్నట్లు ఆర్ట్ ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని కనుక్కోగలమనే దాన్ని ఈ నాణేలు గుర్తు చేస్తాయని, ఇవి నగరవాసులకు, సందర్శకులకు జ్ఞాపికలుగా మిగిలిపోతాయని మార్క్ గాండెర్ వెల్లడించారు. (చదవండి: భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక ఉండొచ్చట!) -
లఘుచిత్రోత్సవం నిర్వహించడం అభినందనీయం
పాలకొల్లులో డిసెంబర్లో అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం పాలకొల్లు టౌన్: కలలకు, కళాకారులకు పుట్టినిలై ్లన పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రాలను తీసేవారికి మంచి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు సమాజానికి మంచి సందేశం అందించడానికి క్షీరపురి అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సంస్థ చేస్తున్న కషి అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య అన్నారు. పాలకొల్లులో ఆదివారం క్షీరపురి అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సంస్థ ముత్యాల శ్రీనివాస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో ఉన్నా అనేక సినిమాలు గోదావరి జిల్లాల్లో నిర్మించడం జరిగిందన్నారు. లఘు చిత్రాలు తీసి చలన చిత్రాల్లో ప్రఖ్యాతిగాంచిన దర్శకులు అనేమంది ఉన్నారన్నారు. సమాజ రుగ్మతలను, వ్యక్తి ప్రవర్తన, ఆలోచన విధానాలను మార్పు తీసుకురావడానికి లఘు చిత్రాలు ఎంతో దోహద పడతాయన్నారు. ఇటువంటి లఘు చిలన చిత్రోత్సవాలను నిర్వహించి వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్న కమిటీని వారు అభినందించారు. మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత డీసెంట్రలైజేషన్‌లో భాగంగా గోదావరి ప్రాంతాన్ని సినీ ఇండస్ట్రీ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కషి చేయవలసిన అవసరం ఉందన్నారు. పాలకొల్లులో నిర్మితమవుతున్న ఓపెన్ ఎయిర్ థియేటర్ కాంప్లెక్సులో ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమకు అవసరమైన నటులు, టెక్నిషియన్లకు శిక్షణ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వం దష్టికి తీసుకు వెళ్లి కషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీ లోపు షార్ట్ ఫిలిం ఎంట్రీలను పంపించి నమోదు చేసుకోవాలన్నారు. స్క్రూట్నీ అనంతరం ఎంపిక కాబడిన చిత్రాలను డిసెంబర్ 23వ తేదీన ప్రకటిస్తామని, అనంతరం ఫిలిం ఫెస్టివల్ తేదీని ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రోత్సవంలో ఎంపికైన షార్ట్‌ఫిలింలకు ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.60వేలు, రూ.40వేలు, రూ.20వేలు నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. స్క్రూట్నీలో ఎంపికైన ప్రతీ షార్ట్ ఫిలింకు రూ.5వేలు ప్రోత్సాహక బహుమతి అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, ఎం రాంప్రసాద్, ఆర్వీ అప్పారావు, బొక్కా రమాకాంత్, మేడికొండ రామదాసు, గొర్ల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నేషనల్ ఫిలింఫెస్ట్వల్కు ‘లక్ష్మీనరసింహస్వామి’
కొలిమిగుండ్ల: శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో కొలిమిగుండ్ల కొండపై నిర్మితమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిలిం (డ్యాక్యుమెంటరీ) ఫెస్టివల్లో స్థానం లభించింది. మూడు రోజుల క్రితం వీటికి సంబంధించిన ఫలితాలను జ్యూరీ మెంబర్స్ విడుదల చేశారు. ఈడాక్యుమెంటరీని అనంతపురానికి చెందిన మక్కం అవినాష్‌కుమార్ దర్శకత్వంలో నిర్మించారు. మన ఊరు–మన పురాతన దేవాలయం నాడు–నేడు అనే అంశంపై సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలన చిత్రత్సోవ పోటీలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి 113 డాక్యుమెంటరీలు వచ్చినట్లు అవినాష్‌కుమార్ తెలిపారు. ఇందులో కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహస్వామి పేరుతో తీసిన డాక్యుమెంటరీకి నాల్గవ స్థానం దక్కిందని ఆయన ఆదివారం సాక్షికి తెలిపారు. ఎంపికైన వాటికి సంబంధించి ఆగష్టు మూడవ వారంలో హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లో మూడు రోజుల పాటు ప్రదర్శనతో పాటు అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. ఇందులో భాగంగా రూ.10వేల నగదు అందజేస్తారన్నారు. శిథిలావస్థకు చేరుకుంటున్న చారిత్రక ఆలయాలను అభివద్ధి చేసేందుకు ఏటా నిర్వాహకులు అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐలు స్పందించి విరాళాలు ఇస్తే ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావాలనే గొప్ప సదుద్దేశంతో పోటీలు జరుపుతున్నారన్నారు. -
అంతర్జాతీయ చిత్రోత్సవాలకు క్రిమి
తమిళసినిమా : క్రిమి చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాలకు నామినేట్ అయ్యిందని ఆ చిత్ర దర్శకుడు కరుణ్చరణ్ వెల్లడించారు. నిర్మాతలు ఎస్.రాజేంద్రన్, ఎం.రజనీ జయరామన్, ఎల్.పృథ్వీరాజ్, కె.జయరామన్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం క్రిమి. చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు అరుణ్చరణ్ మాట్లాడుతూ క్రిమి చిత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు నామినేట్ అయ్యిందన్నారు. అయితే ఆ వివరాలను గురువారం వెల్లడిస్తానని చెప్పా రు. ఇది తన తొలి చిత్రం అన్నారు. ఇందులో హీరోగా కదిర్‌ను నటింప చేయాలని అనుకోలేదని అయితే తన తల్లి చెప్పడంతో అతడిని హీరోగా ఎంపిక చేశానని అన్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న ఎస్కేప్ ఆర్టిస్ట్ మారన్ మాట్లాడుతూ క్రిమి చిత్రాన్ని తాను మూడుసార్లు చూశానని తెలిపారు. అయితే ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదని అన్నారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎస్ ఎ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు అరుణ్ చరణ్ తనను కలిసి చిత్రం చూడమని కోరారన్నారు. తాను అప్పుడు సగం మాత్రం చూడగలిగానని చెప్పానన్నారు. అయితే థియేటర్ లో కూర్చొన్న తరువాత మధ్యలో వెళ్లలేక పోయానని పూర్తిగా చిత్రం చూశానని ఆయన తెలిపారు. కారణం క్రిమి చిత్రం తనను అంతగా ఆకట్టుకుందని చెప్పారు.