లఘుచిత్రోత్సవం నిర్వహించడం అభినందనీయం
Published Sun, Oct 23 2016 7:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
పాలకొల్లులో డిసెంబర్‌లో అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం
పాలకొల్లు టౌన్: కలలకు, కళాకారులకు పుట్టినిలై ్లన పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రాలను తీసేవారికి మంచి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు సమాజానికి మంచి సందేశం అందించడానికి క్షీరపురి అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సంస్థ చేస్తున్న కషి అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య అన్నారు. పాలకొల్లులో ఆదివారం క్షీరపురి అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సంస్థ ముత్యాల శ్రీనివాస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో ఉన్నా అనేక సినిమాలు గోదావరి జిల్లాల్లో నిర్మించడం జరిగిందన్నారు. లఘు చిత్రాలు తీసి చలన చిత్రాల్లో ప్రఖ్యాతిగాంచిన దర్శకులు అనేమంది ఉన్నారన్నారు. సమాజ రుగ్మతలను, వ్యక్తి ప్రవర్తన, ఆలోచన విధానాలను మార్పు తీసుకురావడానికి లఘు చిత్రాలు ఎంతో దోహద పడతాయన్నారు. ఇటువంటి లఘు చిలన చిత్రోత్సవాలను నిర్వహించి వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్న కమిటీని వారు అభినందించారు. మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత డీసెంట్రలైజేషన్‌లో భాగంగా గోదావరి ప్రాంతాన్ని సినీ ఇండస్ట్రీ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కషి చేయవలసిన అవసరం ఉందన్నారు. పాలకొల్లులో నిర్మితమవుతున్న ఓపెన్ ఎయిర్ థియేటర్ కాంప్లెక్సులో ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమకు అవసరమైన నటులు, టెక్నిషియన్‌లకు శిక్షణ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వం దష్టికి తీసుకు వెళ్లి కషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీ లోపు షార్ట్ ఫిలిం ఎంట్రీలను పంపించి నమోదు చేసుకోవాలన్నారు. స్క్రూట్నీ అనంతరం ఎంపిక కాబడిన చిత్రాలను డిసెంబర్ 23వ తేదీన ప్రకటిస్తామని, అనంతరం ఫిలిం ఫెస్టివల్ తేదీని ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రోత్సవంలో ఎంపికైన షార్ట్‌ఫిలింలకు ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.60వేలు, రూ.40వేలు, రూ.20వేలు నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. స్క్రూట్నీలో ఎంపికైన ప్రతీ షార్ట్ ఫిలింకు రూ.5వేలు ప్రోత్సాహక బహుమతి అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, ఎం రాంప్రసాద్, ఆర్వీ అప్పారావు, బొక్కా రమాకాంత్, మేడికొండ రామదాసు, గొర్ల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement