Tesla CEO Elon Musk Says He Is Buying Manchester United Football Club - Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌ మరో సంచలనం! ఫుట్‌బాల్‌ టీమ్‌ను కొంటున్నా!

Published Wed, Aug 17 2022 9:26 AM | Last Updated on Wed, Aug 17 2022 1:07 PM

Elon Musk Said He Is Buying A Football Club Manchester United In A Series Of Tweets - Sakshi

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ కొనుగోలుపై టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ వెనక్కి తగ‍్గారు. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకోవడంతో మస్క్‌పై ట్విట్టర్‌ చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ టీం మాంచెస్టర్‌ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉండే ఎలాన్‌ మస్క్‌ తాజాగా అమెరికన్‌ పాలిటిక్స్‌పై ట్వీట్‌ చేశారు. నేను రిపబ్లికన్,డెమోక్రటిక్ ఈ రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కొద్ది సేపటికే ఫుట్‌బాట్‌ టీం మాంచెస్టర్‌ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్‌లో వెల్లడించారు. ప్రస్తుతం మస్క్‌ నిర్ణయం బిజినెస్‌ వరల్డ్‌లో మరింత ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్‌ కొనుగోలుపై విచారణ జరుగుతుండగా ఈ బిజినెస్‌ టైకూన్‌ నిర్ణయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

చదవండి👉  'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్‌ మహీంద్రా రీ ట్వీట్‌ వైరల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement