
మాంచెస్టర్: క్రికెట్ వరల్డ్‌కప్ ఫీవర్ అందరినీ ఊపేస్తోంది. సినీ తారలే కాకుండా పారిశ్రామికవేత్తలు సైతం మ్యాచ్‌ను చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వరల్డ్ కప్‌ను వీక్షించేందుకు సెలబ్రిటీలు ఇంగ్లండ్‌కు క్యూ కడుతున్న క్రమంలో ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్‌ల మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా వచ్చారు. వీరు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. వేలాదిమంది వీక్షిస్తున్న ఈ మ్యాచ్‌లో అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం మ్యాచ్‌ను వీక్షిస్తున్న ముఖేష్ అంబానీ కుటుంబ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారత్‌కు మద్దతుగా నీతా అంబానీ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతూ జాతీయ జెండాను ప్రదర్శించారు. బ్లూ జెర్సీ ధరించిన ఈమె మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. క్రికెటర్ కృనాల్ పాండ్యా ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీతో కాసేపు ముచ్చటించాడు. నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఆట మొత్తాన్ని ఎంతో ఉత్కంఠగా చూస్తూ కెమెరాలో బంధించింది. ఇక ముఖేష్ అంబానీ ఎప్పటిలాగే ఎంతో హుందాగా సూట్‌లో దర్శనమిచ్చారు.